డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు వైరల్ అయ్యాయి. సినిమాలపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని, నిర్మాతలు ఎదురుకుంటున్న సవాల్ ని, సినిమాని కొందరు ఎలా చంపేస్తున్నారో, ఎంతలా నష్టం కలిగిస్తున్నారో.. ఇలా చాలా అంశాలని తమన్ ప్రస్థావించారు. తమన్ చెప్పిన మాటలు ఇప్పుడు చిరంజీవిని కదిలించాయి. ఈ మేరకు చిరు ఓ పోస్ట్ పెట్టారు.
”నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది’అని చెప్పుకొచ్చారు చిరు.
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై నెగిటివి పెరిగిపోతుంది. వ్యక్తిగత దూషణలు హద్దులు దాటుతున్నాయి. సినిమాలకి నష్టం కలిగించేలా కొన్ని ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. గేమ్ చెంజర్ సినిమా అయితే ఏకంగా హెచ్ డీ ప్రింట్ నెట్ లో ప్రత్యేక్షమైయింది. ఆ ప్రింట్ కొందరు పనికట్టుకొని షేర్ చేశారు. కొందరు ఫ్యాన్స్ ముగుసులో సినిమాలకి చాలా నష్టం కలిగిస్తున్నారు. ఎక్కడ చూసిన నెగిటివ్ మాటలే తప్పా అసలు పాజిటివ్ వాతావరణమే లేకపోయింది. ఇలాంటి సందర్భంలో తన ఆవేదన వ్యక్తం చేశారు తమన్.