బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనలో భార్య కరీనా కపూర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేసుకున్నారు. ‘కొడుకు జేహ్, కేర్ టేకర్‌ను కాపాడే ప్రయత్నంలో దుండగుడితో సైఫ్ ఫైట్ చేశారు. ఈక్రమంలోనే అతడు సైఫ్‌పై ఎటాక్ చేశాడు. దాదాపు ఆరుసార్లు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లల్ని పై ఫ్లోర్ కి సురక్షితంగా తరలించాం. నాకు ధైర్యం చెప్పడానికి మా అక్క కరిష్మా వచ్చింది. నన్ను వెంటనే తన ఇంటికి తీసుకువెళ్లింది’ ఇది కరీనా కపూర్ స్టేట్మెంట్ అనే కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం విచారణ జోరుగా జరుగుతోంది. దాడి జరిగి మూడు రోజులవుతున్నా దుండగుడు మాత్రం ఇంకా దొరకలేదు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెప్పారు. నడవగలుగుతున్నారని, భోజనం తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇంకొంత సమయం ఆయన వైద్యుల పర్యవేక్షణలో వుండే అవకాశం ఉంది.