గుడివాడ అమర్నాథ్ మెల్లగా చోడవరం నియోజకవర్గం చేరుకున్నారు. తనకు భీమిలి నియోజకవర్గం కావాలని జగన్ , సజ్జల వద్ద లాబీయింగ్ చేసుకున్నారు. అనకాపల్లి నుంచి గెలిచినా గత ఎన్నికల సమయంలో గాజువాకలో పడేశారు. అక్కడ ఆయన రాష్ట్రంలోనే అత్యధిక తేడాతో ఓడిపోయిన నేతల్లో ఒకరిగా మారారు. దాంతో ఇక అక్కడ కూడా కష్టమని భీమిలీ నియోజకవర్గంలో పని చేసుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా ఎవరైనా సొంతంగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే నచ్చదు ఖచ్చితంగా వేరే నియోజకవర్గాన్ని కేటాయిస్తారు. అలాగే ఇప్పుడు ఆయనకు చోడవరం నియోజకవర్గాన్ని కేటాయించారు.
చోడవరంమాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీనికి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడి గా అవకాశం ఇచ్చారు. అలాగే మరికొన్ని ఇంచార్జ్ ఆవుల్ని కూడా వైసీపీ ప్రకటించింది. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త గా బూడి ముత్యాల నాయుడును నియమించారు. ఆయన గతంలో అక్కడే ఎమ్మెల్యేగా ఉండేవారు. చివరి క్షణంలో ఎంపీగా పోటీకి పంపారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గానికి పంపారు. ఇక భీమిలీకి బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుకు ఇంచార్జ్‌గా నియమించారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త గా తిప్పల దేవన్ రెడ్డి ని నియమించారు. ఆయన ఎన్నికలకు ముందు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ ఇంచార్జలు నియామకాలు చూస్తూంటే జగన్ రెడ్డిఇంకా నేర్చుకోలేదని ఆయన తన ఈగో కోసమే పార్టీ నియామకాలు చేస్తున్నట్లుగా ఉందని ఆ పార్టీ నేతలు గందరగోళపడుతున్నారు. లేకపోతే విజయనగరం జిల్లాకు చెందిన బొత్స కుటుంబానికి చెందిన వ్యక్తి భీమిలికి ఇంచార్జ్ గా వేయడంఏమిటన్న ప్రశ్నను వారు లెవనెత్తుతున్నారు. అయితే జగన్ అనుకున్నదే జరుగుతుంది కాబట్టి ఎవరూ నోరు మెదపలేరు.