ఇద్దరు మిత్రులు.. ఐపీఎస్‌లు. ఒకరు ఐపీఎస్‌గా ఉండి.. పోలీస్ డ్యూటీలు చేయకుండా.. సంక్షేమ హాస్టళ్ల బాధ్యత తీసుకుని ప్రత్యేకంగా ప్రైవేటు ఆర్మీని పెంచుకున్నారు. మరొకరు అధికారంలో ఉన్న పార్టీకి ఊడిగం చేసి ప్రత్యర్థి పార్టీ నేతల్ని వేధించి.. మత మార్పిడి సంస్థతో అనేక వివాదాలు తెచ్చుకున్నారు. సర్వీసులో చేసిన తప్పులకు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. ఓ మిత్రుడు పడుతున్న కష్టం మరో మిత్రుడ్ని కదిలిస్తోంది. ఎక్కడ జైలుకు పోతాడోనని వెంటనే రాజకీయాల్లోకి రావాలని సలహాలు ఇస్తున్నారు. ఆ ఇద్దరు మిత్రుల ప్రవీణ్ కుమారు, సునీల్ కుమార్.
ప్రతీ దానికి కులాన్ని అంటించేసుకుని తాము చేసిన తప్పుల నుంచి బయటపడాలని అనుకునే మేధావితనం వీళ్ల సొంతం. సీఐడీ చీఫ్ గా పీవీ సునీల్ చేసిన తప్పులకు.. ఇప్పటికీ ఆయన జైల్లో ఉండాల్సింది. కానీ ప్రభుత్వం కనీసం సస్పెండ్ చేయలేదు. విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రవీణ్ కుమార్ పదే పదే మిత్రుడి కోసం ఓవరాక్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే అంత కంటే ముందు డీజీ స్థాయి అధికారి అయిన ఏక్ వెంకటేశ్వరరావుపై తప్పుడు కేసులు పెట్టి..కనీస ఆధారాల్లేకపోయినా.. పదేళ్ల పాటు సస్పెండ్ చేస్తే ఈ కుమార్ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ తప్పులు చేసి దొరికిన సునీల్ కుమార్ ను మాత్రం అడ్డంగా వెనకేసుకొస్తున్నారు.
సునీల్ కుమార్ రాజకీయాల్లోకి రావొచ్చు. ఎవరూ ఆపరు. ఆ లక్ష్యంతోనే ఆయన మతమార్పిడి సంస్థను పెట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్ స్వేరో పెట్టుకున్నట్లే. జగన్ రెడ్డి టిక్కెట్ ఇస్తారనే అడ్డగోలు పనులు చేశారు. ఇప్పుడు దొరికిపోయారు. తప్పు చేసి కులాన్ని అడ్డం పెట్టుకుని.. బయటపడిపోయి రాజకీయాల్లోకి వస్తామని.. రావాలనో బెదిరిస్తేనే బయటపడిపోలేరు. ప్రవీణ్ కుమార్ ముందు బీఎస్పీ చీఫ్ గా ఉన్నప్పుడు ఏం చెప్పారు.. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరి ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి. అప్పుడు గౌరవిస్తున్న ఎవరైనా ఇప్పుడు గౌరవిస్తున్నారో లేదో చూసుకోవాలి. సునీల్ ను ప్రభుత్వం వేధిస్తుందో.. చట్ట ప్రకారం శిక్షిస్తుందో అక్కడి ప్రజలు చూసుకుంటారు.