సీనియర్ యాక్టర్ నరేష్ తన తల్లికి పద్మశ్రీ ఎందుకివ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చిత్ర పరిశ్రమలో తన తల్లి విజయనిర్మలకు ప్రత్యేక స్థానం ఉందని 46 సినిమాలకు దర్శకత్వం చేశారని ఆయన అంటున్నారు. ఇప్పటి వరకూ తన తల్లికి పద్మశ్రీ ఇప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశానని ఇక ధర్నాలు చేయడమే మిగిలిందని అది కూడా చేస్తానని అంటున్నారు.
చనిపోయిన వారికి కూడా పద్మశ్రీలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తన తల్లికి పద్మశ్రీ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ చేసిన లాబీయింగ్ వల్ల ఆ అవార్డు రాలేదట. ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశానని.. అలాగే కేసీఆర్ ద్వారా కూడా ప్రయత్నాలు చేశానని అంటున్నారు. అయినా ఫలితం లేదని ఇప్పుడు బీజేపీ హయాంలో అర్హులకే ఇస్తున్నరని అందుకే తన తల్లికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు . అన్ని ప్రయత్నాలు చేశానని ఇక ధర్నాలు, ఆందోళనలు చేస్తానని నరేష్ అంటున్నారు. సీరియస్ గా అంటున్నారో.. కామెడీగా అంటున్నరో కానీ అవార్డుల కోసం ధర్నాలు, ఆందోళనలు చేయడం కాస్త కామెజీగా ఉంటుంది. ఇలాంటివి చేసి తెచ్చుకునే అవార్డుకు ఎంత విలువ ఉంటుంది ?
సీనియర్ హీరో నరేష్ బీజేపీ నేత. ఒకప్పుడు బీజేపీ కోసం బాగానే కష్టపడ్డారు. ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తర్వాత వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఉపయోగించుకుని ఆయన లాబీయింగ్ కూడా వర్కవుట్లు కాలేదు. అందకే అసహనానికి గురవుతున్నారు. తన తల్లికి పద్మశ్రీ అవార్డును తీసుకు వచ్చి ఆమెకు అత్యున్నత గౌరవాన్ని మరణానంతరం అయినా కల్పించాలని అనుకుంటున్నారు.