రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తులసీబాబు. ఆయన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తీరు చూస్తే వీధిరౌడీకి ఎక్కువ.. పొలిటికల్ లీడర్ కు తక్కువ అన్నట్లుగా ఉంటుంది. ఆయన ఐపీఎస్ పీవీ సునీల్ ను అడ్డం పెట్టుకుని పోలీసు శాఖ సొమ్మునే ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నాడని వివరాలు బయటకు వస్తున్నాయి.
పీవీ సునీల్ సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు లీగల్ అడ్వయిజర్ గా సీఐడీకి సేవలు అందిస్తానంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఐటీ కంపెనీ యజమాని అవతారం ఎత్తాడు పోలీస్ హసింగ్ హోర్డు వెబ్ సైట్ లో డాష్ బోర్డు నిర్వహిస్తానని రూ. మూడు కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకూ పనులు చేయలేదు. అసలు డాష్ బోర్డే లేదు. అసలు డాష్ బోర్డు ఏర్పాటు, నిర్వహణకు కోట్లు ఎందుకో పీవీ సునీల్ కే తెలియాలి. ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వ్యవహారాలను చూసినప్పుడే ఈ దందా నడిచింది.
పొలీసుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన డబ్బును పీవీ సునీల్ ఇలా తులసిబాబు ఖాతాలోకి టెండర్ల పేరుతో పంపడం ఏమిటి.. అన్నది ఇప్పుడు పోలీస్ వర్గాల్లోనే హాట్ టాపిక్ అవుతోంది. ఈ అంశంపైనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు తులసిబాబు ఎవరో తనకు తెలియదని..తెలుసు అని ప్రచారం చేసేవాళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పీవీ సునీల్ అంటున్నారు. కానీ బయట పడుతున్న విషయాలు మాత్రం తేడాగా ఉన్నాయి.