తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో విజిలెన్స్ చేసిన దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి చేరింది. ప్రాథమిక నివేదికలో అనేక అవకతవకలు గుర్తించారు. శ్రీవాణి ట్రస్టు నిధులు దారి మళ్లింపు దగ్గర నుంచి దర్శనం టిక్కెట్లను లక్షలకు లక్షలు అమ్ముకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ విజిలెన్స్ రిపోర్టుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఇప్పుడు పూర్తి అధికారం ఉంది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.
ఓ వైపు టీటీడీ విషయంలో చిన్న అవకాశం దొరికితే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడానికి రెడీగా ఉంటున్నారు. చివరికి మాఢవీధుల్లో చెప్పులు వేసుకుని వెళ్తున్నారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి విమర్శిస్తున్నారు. అసలు చెప్పులు వేసుకుని ఆలయంలోకే జగన్ ను తీసుకెళ్లబోయిన చరిత్ర ఆయనది. నిజానికి మాడ వీధుల్లో భక్తులు చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకున్నారని ఆయన ఎందుకు చెబుతున్నారో కానీ.. కొంత మంది ఆరోగ్య సమస్యల వల్ల ధరిస్తూ ఉండవచ్చవేమో కానీ.. భక్తుల నమ్మకం మీద టీటీడీ వ్యవహారాలు నడుస్తాయి. అపవిత్రం చేయాలని ఎవరూ ఆ పని చేయరు.
వైసీపీ హయాంలో కొండ మీద జరిగిన అరాచకాలన్నీ విజిలెన్స్ రిపోర్టుతో బయటకు వస్తాయి. ప్రభుత్వం ఆ రిపోర్టును బయట బాధ్యలైన వారిపై కేసులు పెడితే తప్ప.. దారికి వచ్చే పరిస్థితి లేదు. తమ హయాంలో అద్భుతంగా జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ అసలు జరిగిందేమిటో బయట పెట్టాలని టీడీపీ నేతలు అంటున్నారు.