సెలెబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్కు క్షమాపణ చెప్పారు. వేణుస్వామి, హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలు వివాదమైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పారు వేణు స్వామి.
వేణు స్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు.
మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. దీంతో మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని ఉమెన్ కమిషన్ హెచ్చరించింది.