మావోయిస్టు చలపతి చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయారు. ఈయన ఎవరో ప్రస్తుత తరానికి తెలియదు.కానీ ఆయన తలపై రూ. కోటి రివార్డు ఉందంటే.. కేంద్రం కూడా ఈయనను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి విశాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నక్సల్స్‌లో చేరిపోయి అడవి బాట పట్టారు. అప్పటి నుంచి ఆయన చేసిన ఆపరేషన్లు అన్నీ ఇన్నీ కావు. మావోయిస్టు టాప్ ఫైవ్ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు. ఎన్నో దాడులకు నేతృత్వం వహించారు.
తన జీవితాన్ని పూర్తిగా అడవులకే అంకితం చేసిన ఆయన పలుమార్లు ఎన్ కౌంటర్ బారి నుంచి తప్పించుకున్నారు. అయితే వరుస ఎన్ కౌంటర్లతో పూర్తిగా బలహీనపడడిపోయిన సమయంలో ఆయన కూడా ప్రాణాలు వయసు కారణంగా ఆయన పూర్తిగా కొత్త మావోయిస్టులు ఎవరైనా చేరితే వారికి శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల సమయం కేటాయిస్తున్నారు. ఆయనతో పాటు మరో పదిహేను మంది కూడా చనిపోయారు. చలపతి చనిపోతే ఇక మావోయిస్టుల వెన్నుముక కూడా విరిగిపోయినట్లే. అందుకే ఎన్ కౌంటర్ జరగగానే అమిత్ షా కూడా.. మావోయిజం అంతమైనట్లనని ప్రకటన చేశారు.
రెండు, మూడు దశాబ్దాల కిందట మావోయిజం, నక్సలిజం అంటే యువతలో క్రేజ్ ఉండేది. చాలా మంది అడవుల బాట పట్టేందుకు ఆసక్తి చూపేవారు. కానీ రాను రాను పరిస్థితి మారిపోయింది. గ్లోబలజేేషన్ కారణంగా అవకాశాలు పెరగడంతో యువత ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని డిసైడయికెరీర్ ను ఎంచుకుంది.ఈ మార్పును గమనించని మావోయిస్టులు తమ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే కాన్సెప్టుకు స్థిరపడిపోయి .. అవసరం లేకపోయినా పోలీసుల్ని, నేతల్ని హత్య చేస్తూ తాము ఎన్ కౌంటర్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుత ఎన్ కౌంటర్ తో మావోయిజం కూడా అంతమైనట్లే అనుకోవచ్చు. ఇంకెనరూ ఆ భావజాలం వైపు చూసే అవకాశం లేదు.