ఎస్ఎస్ తమన్ కాదు.. నందమూరి తమన్.. ఇప్పుడు ఇదే ట్రెడింగ్. బాలయ్య సినిమా అంటే తమన్ కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. బాక్సులు బద్దలైపోయే బీజీఎం కొడతాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ లో కూడా బీజీఎం మామూలుగా లేదు. థియేటర్స్ లో పూనకాలు తెప్పించేశాడు.
అఖండ, వీరసింహారెడ్డి, ఇప్పుడు డాకు మహారాజ్ .. ఇలా బాలయ్య ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే ఆల్బమ్స్ ఇచ్చాడు తమన్. ఈ దెబ్బకి నందమూరి అభిమానులు ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అనే పోస్టులు వైరల్ చేశారు. అక్కడితో ఆగలేదు… సక్సెస్ మీట్ లో స్వయంగా బాలకృష్ణ… నందమూరి తమన్ అన్నారు. ‘ఎన్ బి కే తమన్’ అనే ఇంకో ముద్దుపేరు కూడా ఇచ్చేశారు.
ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా తమన్ ఇంటి మార్చేలే తన ఆమోదం తెలిపారు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో తమన్ తో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ పెడుతున్నారు. ఈ ఈవెంట్ వివరాలు తెలియజేయడానికి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో భువనేశ్వరి. ‘ఎన్ తమన్.. నందమూరి తమన్’అని సంబోధించడం నవ్వులు పూయించింది. వేదికపై వున్న తమన్ కూడా పట్టనంత సంతోషంతో నవ్వేశారు. ఫెబ్రవరి 15న ఈ మ్యూజికల్ నైట్ జరుగుతుంది. ఈ షో ద్వారా వచ్చిన ప్రతి రూపాయి తిరిగి ప్రజాసేవకే ఉపయోగిస్తామని చెప్పారు భువనేశ్వరి.