చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఏడు కేసుల్ని సీబీఐకి ఇవ్వాలని ఓ లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఏబీఎన్ ప్రకటించింది. ఆ లాయర్ ఎవరో కానీ ఆయన పేరు వాడుకుని వైసీపీ లిటిగేషన్ల లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని దాఖలు చేయించి ఉంటారని ఆ పార్టీ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. అయితే కనీసం బుర్ర ఉన్న వారు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల్లో హడావుడిగా చార్జిషీట్లను ఏసీబీ కోర్టులో ఎన్నికలకు ముందే నమోదు చేశారు.
చంద్రబాబుపై కనీస ఆధారాల్లేకుండానే స్కిల్ కేసు, పైబర్ నెట్ కేసు, ఉచితంగా ఇసుక ఇచ్చారని కేసు, లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, రాజధాని భూముల కేసులు ఇలా తలా తోక లేని కేసులు చాలా పెట్టారు. దేంట్లోనూ చిన్న ఆధారం చూపించలేక.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రిని అర్థరాత్రి ఆరెస్టు చేశారు. ఏ వ్యవస్థ కూడా అలా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించకపోగా జైలుకు పంపారు. కనీసం ఒక్క రూపాయి అయినా దుర్వినియోగం అయినట్లుగా కానీ చంద్రబాబుకు చేరినట్లుగా కానీ చూపించలేదు.
చివరికి ఎన్నికలకు ముందు చార్జిషీట్లు దాఖలు చేయించారు. కానీ 17A అంశంలో కేసులు నమోదు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోకపోవడంతో ఆ చార్జిషీట్లను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కానీ దర్యాప్తు పూర్తయినట్లే. ఇప్పుడు ఆ కేసుల్నే సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇటీవల బెయిల్ రద్దు పిటిషన్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఓ జర్నలిస్టు పురవు ఎలా తీయించారో ఈ లాయర్ పరువును కూడా అలా తీయించేందుకు సజ్జల లిటిగేషన్ టీం కంకరణం కట్టుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.