డిప్యూటీ సీఎం అంశంపై ఇక చర్చను ముగించాలని వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని జనసేన పార్టీ తన క్యాడర్ కు.. లీడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వారం రోజుల పాటు డిప్యూటీ సీఎం అంశం కూటమి నేతల మధ్య ఓ రకమైన అడ్డుగోలకు కారణం అయింది. సోషల్ మీడియాలో అయితే రెండు పార్టీల నేతలు పరస్పరం తిట్టుకోవడం ప్రారంభించారు. చివరికి టీడీపీ హైకమాండ్ హెచ్చరికలు జారీ చేయడంతో వారు ఆపేశారు.
జనసేన తరపున కిరణ్ రాయల్ వంటి వారు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. దీంతో జనసేన పార్టీ కూడా ఇలాంటి డిబేట్ ను అసలు ప్రోత్సహించేది లేదని వెంటనే ఈ అంశంపై మాట్లాడటం ఆపేాలని ఆదేశాలు ఇచ్చింది. కూటమిగా ఉన్నప్పుడు ఏదైనా కూటమిలోనే నిర్ణయం తీసుకుంటారని.. బయట చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
తెలుగుదేశం పార్టీ కూడా ఇదే తరహా ఆదేశాలను తమ పార్టీ నేతలకు ఇచ్చింది. జనసేన కూడా అదే చెప్పడంతో.. ఇక ఎవరూ డిప్యూటీ సీఎం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెదికే ప్రయత్నం చేయకపోవచ్చని భావిస్తున్నారు.