ప్రజలు అధికారం ఇచ్చింది అడ్డగోలుగా దోచుకోవడానికేనని .. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాఫియాయిజానికి పాల్పడిన వైసీపీ అగ్రనేతల గుట్టు రట్టు అయింది. తుపాకీని కణతకు పెట్టి కాకినాడ పోర్టును.. కాకినాడ సెజ్ అణాకాణీ పైసలకు లాక్కున్న మాఫియా ఇప్పుడు విచారణలు ప్రారంభం కావడంతో తిరిగి ఇస్తామని కేసులన్నీ ఉపసంహరించుకోవాలని బేరానికి వచ్చింది. అయితే తిరిగి ఇవ్వడం కాదు.. ఇలా లాక్కున్నందున వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారి తీరును ప్రజల ముందు పెట్టి శిక్షించాల్సి ఉంది.
ఐదేళ్లూ మైనింగ్ సహా అన్ని రంగాల్లో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆస్తులను లాక్కున్న మాఫియా
ప్రజలు అధికారం ఇస్తే దాన్ని ఎంతో బాధ్యతతో నిర్వర్తించాలి. కానీ అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను లాక్కునేందుకు ప్రయత్నించడం అత్యంత ఘోరం. పోలీసుల్ని.. పోలీసువ్యవస్థను… ఇతర వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆధారాలు లేకపోయినా నోటీసులు, హెచ్చరికలు, చంపుతామని బెదిరింపులతో రాష్ట్రవ్యాప్తంగా వందల మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల ఆస్తులను రాయించుకున్నారు. మైనింగ్ లో వందల కోట్ల జరిమానాల వెనుక ఉన్న గుట్టు బయటకు తీయాలి. చేతులు మారిన వ్యాపారాల వెనుక ఉన్న మాఫియయిజాన్ని బయటకు తీసి కటకటాల వెనక్కిపోవాల్సి ఉంది.
జత్వానీ కేసు తరహాలో ఎన్నెన్ని జరిగాయో?
ఒక పారిశ్రామికవేత్తను పరాయి రాష్ట్రంలో కేసునుంచి బయటపడేయడానికి ఇక్కడి పోలీసులు మాఫియా మాదిరిగా చేసిన పనితో.. పోలీసుల ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నది. ఓ సాధారణ మహిళపై ఇలాంటి కుట్రలు చేశారంటే ఇక బడా వ్యక్తులపై ఇంకెన్ని కుట్రలు చేసి ఉంటారో ఊహించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అన్నింటినీ వెలికి తీసి నేరస్తుల్ని.. నిందితుల్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ముందు ఉంది.
అంతిమ లబ్దిదారు జగనే !
సీఎం కుర్చీలో కూర్చుంటే ఎవరికైనా కాస్త బాధ్యత అనిపిస్తుంది. కానీ జగన్ రెడ్డికి ప్రజలకు తలా ఐదు, పదివేలు విసిరేసి…తాను రాష్ట్రంలో ఆస్తుల్ని మొత్తం రాసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. పదేళ్ల పాటు అదే చేశారు . ప్రైవేటు వ్యక్తుల్నీ వదిలి పెట్టలేదు. అరబిందో లాక్కున్న కాకినాడ పోర్టులో అసలు బినామీ జగనేనని ఆ డీల్ కు సంబంధం ఉన్న వారు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి బినామీల గురించ సాక్ష్యాలతో సహా బయట పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ముందు ఉంది.