విజయనగరం రామాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్న వ్యక్తి, కేసులో ఏ 2 గా ఉన్న వ్యక్తికి టీడీపీ ప్రభుత్వం రూ. ఐదు లక్షల సాయం చేసిందని బొత్స ఆరోపించారు. విజయనగరంలో ప్రెస్మీట్ పెట్టి మరీ ఈ స్టేట్ మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. సనాతన ధర్మం పాటించే పవన్ కల్యాణ్ దీన్ని ఎలా సహిస్తున్నారని ప్రశ్నించారు. బొత్స స్టేట్ మెంట్ చూసి చాలా మంది .. అవునా.. నిజమా.. రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి ప్రభుత్వం ఐదు లక్షల సాయం చేసిందా అని ఆరా తీశారు. నిజం ఏమిటంటే.. ప్రభుత్వం సాయం చేసిన వ్యక్తి ఆ కేసులో సాక్షిగా ఉన్నారు. రెండో సాక్షిగా ఉన్నారు.
విజయనగరానికి చెందిన ఆటో డ్రైవర్ .. రాములవారి విగ్రహాన్ని దాడి చేసిన ఘటనలో అసలు నిందితుల్ని గుర్తు పట్టారు. అందుకే ఆయనను రెండో సాక్షిగా చేర్చారు. పోలీసులు పిలిచినప్పుడు వెళ్లి కోర్టులో తాను చూసింది చెప్పి వస్తున్నారు. అయితే ఆయన నిరుపేద. ఆయన కుటుంబానికి ఇటీవల కష్టం వచ్చింది.దాంతో ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం అందించింది. దాన్ని ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే అందించారు. అయితే ఆయన నిందితుడు అని సాక్షి నుంచి బొత్సకు సమాచారం .. ప్రెస్ నోట్ వచ్చింది. దాన్ని ఆయన ఆవేశంగా చదివేశారు.
ఇప్పుడు హోంమంత్రి అనిత దగ్గర నుంచి అందరూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. నిందితుడికి.. సాక్షికి తేడా తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తూంటే.. బొత్సకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఘోరమైన ఓటములతో పరువు పోగొట్టుకుంటే రాజకీయం కోసం.. తప్పుడు ప్రకటనలు చేసి. కనీస అవగాహన కూడా లేదని అందరితో అనిపించుకోవాల్సి వచ్చిందంటే… అది చిన్న విషయంకాదు. చాలా అవమానకర విషయం.. బొత్స అదే పాటిస్తున్నారు.