గుంటూరు నగరం పెరుగుతోంది కానీ ఎదగడం లేదని అనుకుంటూ ఉంటారు అక్కడి జనాలు. అయితే ఇప్పుడు మెల్లగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. మౌలిక సదుపాయాల కారణంగా ఒకప్పుడు గుంటూరు నగరం విస్తరణ చాలా స్లోగా ఉండేది. ఓ కొత్త లే ఔట్ వేయాలంటే రియల్టర్లు ముందుకు వచ్చేవారు కాదు. మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయిలో లౌఔట్ వేసిన దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో మార్పు వస్తోంది. నగర్ నివాసాలను చుట్టుపక్కల విస్తరించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ కూడా ప్రయత్నిస్తోంది. దీంతో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి.
మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ రోడ్ ను.. 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ రింగ్ రోడ్ వల్ల రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుపక్కన నివాసాలు పెరుగుతున్నాయి. అపార్టుమెంట్లు, కాలనీల నిర్మాణం జరుగుతోంది. ఆటోనగర్ దగ్గర నుంచి అంకిరెడ్డి పాలెం వరకూ జాతీయ రహదారుల్ని కలుపుతూ నిర్మించిన ఈ రహదారి గుంటూరు నగర్ విస్తరణకు కారణం అవుతోంది.
గోరంట్ల, జేకేసీ కాలేజ్ రోడ్, అగతవరప్పాడు, పెద పలకులూరు, తురకపాలెం, నల్లపాడులు సిటీలో కలిసిపోయాయి. ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. గజం కనీసం ఇరవై వేలు ఉండేలా రియల్ ఎస్టేట్ వృద్ది సాధించింది. నిర్మాణాలు చాలా చురుకుగా సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం ఊపందుకుంటే.. ఉపాది కోసం వచ్చే వారు గుంటూరులోనూ నివాసానికి ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టూ ఓ విలువైన ఆస్తుల ప్రపంచం ఏర్పడుతోందని అనుకోవచ్చు.