అమెరికాలో పుట్టినవారికి పౌరసత్వ దక్కదని వారి తల్లిదండ్రులు అమెరికా పౌరులు అయితేనే ఇక పౌరసత్వం లభిస్తుందని అధికారం చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. ఇది ఫిబ్రవరి ఇరవయ్యో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కానీ అలా రావడానికి ఎంత అవకాశం ఉందని పరిశీలిస్తే.. ఒక్క శాతం కూడా లేదని అమెరికా న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో రాజ్యాంగాన్ని మార్చలేరు !
అమెరికాలో ఎవరు పుట్టినా అమెరికా వారసత్వం లభించడం అనేది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరు. అంటే ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ వ్యతిరేకం. ఏ దేశానికి అయినా రాజ్యాంగమే ఫైనల్. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలకు. అమెరికా రాజ్యాంగాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారు. ఫెడరల్ స్ఫూర్తిగా సిద్ధం చేశారు. దాన్ని మార్చాలంంటే స్థాయిలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుంది.
ట్రంప్ నిర్ణయంపై వరుసగా లా సూట్స్
ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని ఇరవై రెండు రాష్ట్రాలు లా సూట్స్ దాఖలు చేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి లేదని తెలిపాయి. సహజంగా న్యాయసంస్థలు ట్రంప్ ఆదేశాలకు విలువ లేదని విశ్లేషిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చితేనే ట్రంప్ అనుకున్న పని చేయగలరు.
ట్రంప్ రాజ్యాంగాన్ని మార్చగలరా ?
ట్రంప్ కు ఉభయసభల్లో మెజార్టీ ఉంది. ఇటీవలి కాలంలో ఏ అమెరికా అధ్యక్షుడికీ రానంత మద్దతు లభించింది. అయితే రాజ్యాంగాన్ని మార్చేంత కాదు. అమెరికా రాజ్యాంగం మార్చడం అంత సులువు కాదు. సెనెట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ బిల్లు మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. ఇప్పుడు రెండు సభల్లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉంది కానీ మూడింట రెండు వంతుల మెజార్టీ లేదు. అదే సమయంలో మొత్తం యాభై రాష్ట్రాల్లో 75 శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. అది కూడా జరిగే అవకాశం లేదు. పైగా ఇది రాత్రికి రాత్రి బిల్లు పెట్టేసి ఆమోదించ చేసుకునే ప్రక్రియకాదు. చాలా కాలం పడుతుంది. రాజ్యాంగాన్ని మార్చరడం.. సవరణ చేయడం ఎంత అసాధారణం అంటే.. అమెరికా రాజ్యాంగాన్ని చివరి సారి 1992లో మార్చారు. గత మూడు దశాబ్దాలుగా మార్చలేకపోయారు.
రాజ్యాంగాన్ని మార్చగలిగితే ట్రంప్‌లోని నియంత బయటకు వస్తాడు !
రాజ్యాంగాన్ని మార్చగలిగితే ముందు ట్రంప్ చేసే పని తనకు శాశ్వత అధికారం దాఖలు చేసుకుంటారు. అధ్యక్షుడిగా మూడో సారి ఎందుకు ఎన్నిక కాకూడదని ఆయన గతంోల ప్రశ్నించారు నాలుగేళ్ల తర్వాత తాను మరో సారి కూడా పోటీ చేస్తానని అందుకు అవసరం అయితే రాజ్యాంగాన్ని మారుస్తామన్నట్లుగా ట్రంప్ మాట్లాడారు. మూడో సారి పోటీ చేయడానికి ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన ఉందన్నారు. అంటే ముందు ఇదే చేస్తారు.కానీ అలాంటి చాన్స్ లేదని ఎక్కువ మంది వాదన.