కాంగ్రెస్ పట్టించుకోని లీడర్ అద్దంకి దయాకర్ ఏపీ రాజకీయాలు, బీజేపీ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పదేళ్ల పాటు ఫైట్ చేసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న పదవి కూడా ఆయనకు దక్కనీయకుండా చేస్తూంటే.. కనీసం పార్టీ ఆఫీసులో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా తానున్నానని అప్పుడప్పుడూ వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ఏపీలో రాజకీయం..బీజేపీ ఏదో చేస్తందని చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటల కోసం కాచుకుని కూర్చుని ఉండే సాక్షి సిస్టర్ మీడియా పెద్ద పెద్ద బ్రేకింగులు వేసింది.
పవన్ కల్యాణ్ ద్వారా చంద్రబాబుపై బీజేపీ పెత్తనం చెలాయించాలని అనుకుంటోందని.. బీజేపీ మిత్రపక్షాలను మింగేస్తుందని ఆయన చెబుతున్నారు. మరి జనసేన పార్టీ కూడా మిత్రపక్షమే కదా అన్న డౌట్ అద్దంకి దయాకర్ కు రాలేదు. రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలను వారు అవలంభిస్తారు. ఏ రాజకీయ పార్టీ కూడా పరస్పర ప్రయోజనం లేకుండా పొత్తులు పెట్టుకోదు. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఎవరి రాజకీయం వారు చేస్తారు. దానికే పెద్ద పెద్దమాటలు చెప్పి పొత్తులో ఏదో జరిగిపోతోందని ప్రచారం చేసే బాధ్యతను అద్దంకి దయాకర్ తీసుకున్నారు.
కూటమి మధ్య చిచ్చు పెట్టాలని కొద్ది రోజులుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి టీడీపీ, జనసేన నేతలు మరింత ఆజ్యం పోసేలా ప్రకటనలు చేశారు.చివరికి రెండు పార్టీలు.. ఇంకెవరైనా వివాదాస్పద అంశాలపై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాంతో వారు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వారు ప్రారంభమయ్యారు.