వారసత్వం చాలా మందికి ప్లస్ అవుతుంది. కానీ అదే కొంత మందికి మైనస్ అవుతుంది. తెలుగుదేశం యువనేత నారా లోకేష్‌కు వారసత్వం ఏ మాత్రం ప్లస్ కాలేదు. పైగా మైనస్ అయింది. రాజకీయాల్లోకి వస్తాడని ఆయనను. చిన్న వయసు నుంచే ట్రోల్ చేయడానికి వందల కోట్లు బడ్జెట్ పెట్టుకుని ఇతర పార్టీలు ప్రయత్నించాయి. కుర్రాడు చక్కగా స్టాన్ ఫర్డ్ లో చదువుకున్నాడు.. క్లీన్ షేవ్ తో ఉంటాడు కాబట్టి పప్పు అన్నారు. దాడులు, కబ్జాలు, స్కాములు వంటివి వద్దు రాజకీయాలు ప్రజల కోసం, కార్యకర్తల సంక్షేమం కోం అన్నారని .. ముద్దపప్పు అని ట్రోల్ చేశారు. చివరికి శరీరాకృతిని కూడా ట్రోల్ చేశారు. ఎంత ఘోరంగా నారా లోకేష్ ను టార్గెట్ చేశారంటే మరో లీడర్ అయితే మానసికంగా దెబ్బతిని .. వెనుకబడిపోయేవారు. కానీ అక్కడే తన పట్టుదల చూపారు నారా లోకేష్.
2019లో టీడీపీకి అత్యంత గడ్డు పరిస్థితి. చంద్రబాబు వారసత్వాన్ని నారా లోకేష్ అందుకోలేకపోతున్నారని.. ఆయన ఇమేజ్ ప్రజల్లో పలుచగా ఉందని అనుకున్నారు. పదేళ్లు తిరిగే సరికి ఇప్పుడు లోకేష్ ను పప్పు అనే వారి కన్నా నిప్పు అని తెలుసుకుని గగ్గోలు పెడుతున్న వారు వందల మంది ఉన్నారు. తమను వేటాడుతున్నాడని కలుగుల్లోకి పోయి దాక్కున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఆయనను ట్రోల్ చేయడానికి కూడా సాహసించలేరు. అంతగా ఇమేజ్ మార్చుకున్నారు. తనపై వందల కోట్లతో తప్పుడు ప్రచారం చేసిన వారికి తన సామర్థ్యం ఏమిటో నిరూపించారు.
రాజకీయాలు అంటే ఖూనీలు, కబ్జాలు, స్కాములు చేసి అడ్డగోలుగా సంపాదించిన వారికి మాత్రమే కేక్ వాక్ కాదు… స్టాన్ ఫర్డ్ లో చదువుకు వచ్చిన వారికి కూడా చేతనవుతాయని నిరూపించారు. దావోస్‌లో ఆయన చొరవ చూస్తున్న పారిశ్రామికవేత్తలు భారత రాజకీయాల్లో ఇలాంటి చదువుకున్న రాజకీయ నేతల అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సామాన్య ప్రజల్లో మాస్ లీడర్ గా గుర్తింపు పొందుతున్నారు.
నారా లోకేష్ ఇప్పుడే నలభైల్లోకి అడుగుపెట్టారు. ఆయన తన పొలిటికల్ కెరీర్ ప్రారంభంలోనే ఉన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రిని అక్రమ కేసుల్లో అరెస్టు చేసినప్పుడు ఢిల్లీలో చంద్రబాబు ఇమేజ్ కాపాడేందుకు ఆయన జాతీయ మీడియాముందు గట్టిగా వాదన వినిపించారు. జాతీయ నేతలనూ చర్చించారు. కేవలం రాజకీయవేధింపుల కోసమే అరెస్టు చేశారని అందరికీ చెప్పగలిగారు.
నారా లోకేష్‌ను టార్గెట్ చేయని రాజకీయం లేదు. చిన్న వయసులోనే ఆయన అన్నీ ఎదుర్కొన్నారు. ఇప్పటికి అసలు పరుగు ప్రారంభించారు. ఆయన రాజకీయ జీవితం ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సి ఉంది. హ్యాపీ బర్త్ డే నారా లోకేష్ !