తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోదీ కేబినెట్లోకి వెళతారా ?. చంద్రబాబు సమక్షంలోనే మంత్రి భరత్ కాబోయే సీఎం నారా లోకేషేనని ప్రకటించిన తర్వాత చాలా మందిలో ఈ సందేహం వచ్చింది. అంతర్జాతీయమీడియా సంస్థ బ్లూమ్ బెర్గ్ ప్రతినిధికి కూడా ఇదే డౌట్ వచ్చింది. కానీ అది లోకేష్ కు పగ్గాలు ఇచ్చే విషయంలో కాదు. మోదీ టీంలో చంద్రబాబు వంటి సమర్థమైన లీడర్ ఉంటే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది కదా అని.
మోదీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా త్వరలో ఆయన కేబినెట్లో భాగం అవుతారా అని బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి చంద్రబాబును ప్రశ్నించారు. అయితే చంద్రబాబు మాత్రం తనకు రాజకీయంగా ఎలాంటి లక్ష్యాలు లేవని తన దృష్టి అంతా రాష్ట్రాన్ని బాగు చేయడంపైనే ఉందని స్పష్టం చేశారు. మరీ మోదీ స్వయంగా ఆహ్వానిస్తే కేబినెట్ లోకి చేరుతారా అంటే.. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. అందరం కలిసి పని చేస్తున్నామని కేంద్రంలో భాగంగా తమ పార్టీ కూడా ఉందని తమ పార్టీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
చంద్రబాబు కేంద్ర మంత్రిగా వెళ్లి.. లోకేష్‌కు సీఎం పోస్టు అప్పగిస్తారన్న ఊహాగానాలకు చంద్రబాబు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. బ్లూమ్ బెర్గ్ సంస్థ ప్రతినిధికి.. ఈ డౌట్ ఎలా వచ్చిందో కానీ.. రాష్ట్రంలో ఉన్న రాజకీయాలకు సింక్ కావడంతో ఆ కశ్చన్ హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు కూడా క్లియర్ గా క్లారిటీ ీఇచ్చేశారు. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలిన కాలంలోనే చంద్రబాబుకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చింది. కానీ తాను ఏపీకి మాత్రమే పరిమితమని ఆయన అప్పట్లో చెప్పారు. ఇప్పుడు కూడా విభజిత ఏపీకే పరిమితమవుతానంటున్నారు కానీ.. కేంద్రం వరకూ వెళ్లే ఆలోచన చేయడం లేదు.