తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు రెండు టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికలకు ముహుర్తం ముంచుకొస్తోంది. బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది. మార్చి 31 నాటికి ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కానుంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జగిత్యాల జీవన్ రెడ్డి ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు జీవన్ రెడ్డి. మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఉక్కపోతకు గురవుతున్నారు. కానీ ఆయనకు కాకుండా యువనేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. కొత్త అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొన్ని కాలేజీల యజమానులు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఓ టీచర్ ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజక వర్గానికి ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కమ్యూనిస్టు పార్టీ నేత కావడంతో ఆయనకు కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ ఉపాధ్యా ఎమ్మెల్సీ కోసం పోటీ చేయడంపైనా ఆలోచన చేస్తున్నారు.కాంగ్రెస్ సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయ సంఘం తరపున ఎవరైనా నిలబడితే వారికి మద్దతివ్వాలని అనుకుంటున్నారు. ఒక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనే దృష్టి పెడిేత చాలనుకుంటున్నారు.