‘క’తో ఫామ్ లోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం. తన చేతి నిండా ప్రాజెక్టులే. అందులో ‘కె – ర్యాంప్’ ఒకటి. రాజేష్ దండా నిర్మాణంలో రూపొందించే సినిమా ఇది. కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కథ సిద్ధమైంది. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్టు టాక్. ఈ చిత్రంలో కథానాయికగా యుక్తి తరేజాని ఎంచుకొన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘రంగబలి’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది యుక్తి. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే… యుక్తి లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. మోడల్ గా రంగ ప్రవేశం చేసిన యుక్తి బాలీవుడ్ లో కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఇమ్రాన్ హష్మీతో చేసిన ‘లూట్ గయే’ ఆల్బమ్ తో క్రేజ్ సంపాదించుకొంది. ‘రంగబలి’ హిట్ అయితే తెలుగులో బిజీ అయ్యేదే. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు కిరణ్ తో డ్యూయెట్లు పాడేకొనే అవకాశం అందుకొంది.
‘కె – ర్యాంప్’ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని తెలుస్తోంది. ఈ జోనర్లో కిరణ్ సినిమాలేం చేయలేదు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. కిరణ్ నటించిన ‘దిల్ రూబా’ ఈ ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది. ఆ తరవాత ‘కె – ర్యాంప్’ సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. మరోవైపు ‘క’ సీక్వెల్ ను కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నాడు ఈ యువ హీరో.