దావోస్ పర్యటనలో చంద్రబాబు, లోకేష్ కొత్త ఒరవడి సృష్టించారు. ఎప్పుడు వెళ్లినా వేలు, లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ హడావిడి జరిగేది. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోలేదు. పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేస్ అనుకూలతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం. తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఓ రకంగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ మీదనే దృష్టిపెట్టారు.
నిజానికి దావోస్ సదస్సు పూర్తిగా పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడులను ఆకర్షించాలనుకునేవారికి మధ్య ఓ వారధి. అనేక దేశాల్లో ఉన్న అవకాశాలను అక్కడ ప్రజెంట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకోవడం అనేది ఉండదు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలు ఉంటే అక్కడ పత్రాలు మార్చుకుంటారు. ఓ పారిశ్రామిక సంస్థ అయినా.. ఇలా చంద్రబాబో..లోకేషో మరొకరో అడిగారని ఎంవోయూ చేసుకుంటే..అది రియలైజ్ అయ్యేది చాలా తక్కువ. అందుకే అలాంటి పెట్టుబడులకు దూరంగా ఉండాలని చంద్రబాబు,లోకేష్ నిర్ణయించుకున్నారు. అందుకే పూర్తిగా ఏపీ గురించే చెప్పడానికే ప్రాదాన్యం ఇచ్చారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్మయించుకున్న చాలా కంపెనీలు… వాటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ దావోస్ వచ్చారు. తమ ప్రతిపాపనలపై మరోసారి చర్చించారు.అయితే ఆ పెట్టుబడుల ప్రకటనలకు దావోస్ సరైన వేదిక కాదని అనుకున్నారు. లక్షన్నర కోట్ల విలువైన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఎంవోయూ చేసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఏదైనా పూర్తిగా ఏపీలోనే అలాంటి భారీ ప్రకటనలు ఉండాలని అనుకుంటున్నారు. రూపాయి కూడా పెట్టుబడి తేలేదని వైసీపీ నేతలు విమర్శించవచ్చు కానీ.. జగన్ రెడ్డి దావోస్ వెళ్లి.. ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమల పెట్టుబడుల గురించి ఒప్పందాలు చేసుకున్న వైనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటే.. వారి పరువే కదా పోయేది ?