గుడివాడలో గడ్డం గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడిన కొడాలి నాని ఓడిపోయామనే పేరే కానీ మరో వ్యక్తి రంగంలోకి దిగాడు. ఎమ్మెల్యే నిస్సహాయతను అడ్డం పెట్టుకుని.. పదవి అంటే దోపిడీ చేయడమేనని అది తనకు తెలుసన్నట్లుగా రెచ్చిపోతున్నారు. రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో అరెస్టు అయిన తులసీబాబు వ్యవహారం గుడివాడలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
కామేపల్లి తులసీబాబు గుడివాడలో అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతూ షాడో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల ఆయనను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జిల్లా జైలుకు తరలించినప్పుడు స్వయంగా వెనిగండ్ల రాము వెళ్లి గంట సేపు మాట్లాడి రావడం సంచలనంగా మారింది. గుడివాడలో వసూళ్లు ఇతర వ్యవహారాలన్నీ ఆయన చేతుల్లోఉండటంతోనే ఆయన వెళ్లి మాట్లాడారని అర్థమవుతోంది.
వెనిగండ్ల రాము ఎన్నారై. ఆయన డబ్బుల కోసం కక్కుర్తి పడరని అనుకున్నారు. అయితే తులసిబాబును వ్యవహారాలకోసం పెట్టుకోవడంతో ఆయన రెచ్చిపోతున్నారు. వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కు తులసిబాబు సన్నిహితుడు కావడమే వెనిగండ్ల రాముకు ఆయనను దగ్గర చేసింది. వెనిగండ్ల రాముకు, ఐపీఎస్ అధికారి సునీల్ కు పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా గుడివాడలోఇప్పుడు తులసిబాబు ఓ అరాచకశక్తిగా మారారు. కొడాలి నానిని ఓడించడానికి ప్రజలు చేసిన ప్రయత్నం చివరికి. తులసిబాబు అనే వ్యక్తి అరాచకశక్తిగా మారడానికి ఉపయోగపడింది.
తులసిబాబు ఎంత గా బరితెగిస్తారంటే.. పోలీసుల్ని కూడా గుడివాడ రండి తేల్చుకుందామని అనేంత. ఆయనను సుదీర్గ కాలం జైల్లో ఉంచి అసలు గుట్టు బయటకు లాగేలా పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు.