రియల్ ఎస్టేట్ జోరుగా ఉన్నప్పుడు రేటు ఎక్కువ పెట్టి కొనడం మంచి పెట్టుబడి కాదు. కానీ డౌన్ లో ఉన్నప్పుడు కొని భూమి వచ్చినప్పుడు అమ్ముకోవడమే అసలైన ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ కొన్ని సందర్బాల్లో డల్ అయిపోయింది. ఖచ్చితంగా ఎల్లకాలం అదే పరిస్థితి ఉండదని అందరికీ తెలుసు. కానీ ధైర్యం చేయరు. ధైర్యం చేసిన వారికి మాత్రం లాభాలు వస్తాయి. ఇప్పుడు కరీంనగర్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి మంచి సమయం కనిపిస్తోంది.
కొంత కాలంగా అన్ని చోట్లలానే కరీంనగర్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గిపోయాయి. కొత్త జిల్లా విభజన తర్వాత కృత్రిమమైన హైప్ రావడంతో పెద్ద ఎత్తున ధరలు పెంచేశారు. చాలా మంది పెట్టుబడులు పెట్టారు. అవన్నీ స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు ఆ ధరల్ని పెట్టి కొనేవారు కూడా లేరు. అలాగని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టానికి అమ్ముకోలేరు. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు తగ్గిపోయాయి. వడ్డీలు పెరిగిపోతూండటంతో పలువురు వ్యాపారులు వారు కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాలు, భూములు, ప్లాట్స్ అమ్మేందుకు రేట్లు తగ్గించేందుకు సిద్దపడుతున్నారు.
కరీంనగర్ పట్టణం విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నందున వచ్చే మూడు నాలుగేళ్లలో ఎవరూ ఊహించనంత అభివృద్ధి కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే అత్యధిక రేట్లను రెండేళ్ల కిందటే వసూలు చేయడంతో పెరుగుదల లేకుండా పోయింది. ఈ పరిస్థితి త్వలో మారుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు కరీంనగర్లో పెట్టుబడికి మంచి అవకాశం అని చెబుతున్నారు.