భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్యతో విడిపోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఇరవై ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరికొకరు అన్ ఫాలో చేసుకున్నారు. చట్టబద్దంగా విడాకుల ప్రక్రియ పూర్తి అయినందున ఇలా సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ క్రికెటర్ తన కెరీర్ సూపర్ హై లో ఉన్నప్పుడు ఆర్తి ఆహ్లావత్ ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
ఇరవై ఏళ్ల దాంపత్యంలో వారి మధ్య ఎప్పుడూ సమస్యలు ఉన్నట్లుగా వెలుగులోకి రాలేదు. క్రికెట్ నుంచి రిటైరైనా తర్వాత సెహ్వాగ్ పలు స్కూల్స్ నిర్వహిస్తున్నారు. అలాగే క్రీడలకు సంబంధించిన ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నారు. కొంత కాలంగా వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సెహ్వాగ్ ఇటీవల భార్యతో కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేయలేదు. గత దీపావళికి కూడా పిల్లలు, తల్లితో కలిసి దిగిన ఫోటోను మాత్రమే షేర్ చేశారు.
సెహ్వాగ్ దంపతుల మధ్య విబేధాలకు కారణం ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. ఇద్దరూ విడిపోతున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతున్నా ఇంత వరకూ స్పందించకపోవడంతో వారు కన్ఫర్మ్ చేసినట్లు అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.