దావోస్లో ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఎంవోయూలు చేసుకోకపోవడంపై వైసీపీ బీభత్సమైన ఆనందంతో గంతులేస్తోంది. పెట్టుబడులు రావడం లేదని అదే పనిగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెప్పుకుంటున్నారు. గురువారం సాయంత్రం గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పెట్టుబడులు రావడం లేదని ప్రకటించేస్తున్నారు. ఎందుకంటే .. అందరూ ఒక్కో కారణం చెబుతున్నారు. చివరికి తప్పు చేసిన ఐపీఎస్ల మీద కేసులు పెట్టడం వల్ల కూడా పెట్టుబడులు రాలేదట.
అసలు దావోస్లో ఎంవోయూలు చేసుకుంటనే పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారో కానీ ఒక వేళ చేసుకుని ఉంటే.. అవన్నీ బోగస్ అని ఇదే స్థాయిలో అందరూ ఎగబడి ప్రెస్మీట్లు పెట్టి ఉండేవారు. ఎందుకంటే.. ఏదో ఒకటి వెదుక్కోవడానికే వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పుడు ఎంవోయూలు చేసుకోలేదని వైసీపీ నేతలు సంబర పడుతూ.. తమకు ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం కారణంగానే అవి రావడం లేదని చెప్పడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా జగన్ మిత్రుడు జిందాల్ కోసం జగన్ రెడ్డి చేసిన నిర్వాకాన్ని బయట పెట్టడం వల్లనే పెట్టుబడులు రావడం లేదని చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
దావోస్తో సంబంధం లేకుండా ఏపీకి ఇప్పటికే ఏడు నెలల కాలంలోనే మూడు లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. విశాఖకు టీసీఎస్ వచ్చింది. విశాఖలో హెచ్సీఎల్ విస్తరిస్తున్నారు. గూగుల్ కూడా ఒప్పందం చేసుకుంది. ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కానీ చంద్రబాబు, లోకేష్ ఎంవోయూలు కాకుండా నేరుగా పెట్టుబడుల ఒప్పందాలకే ప్రయత్నిస్తున్నారు. అవే నిజమైనవని వారికి తెలుసు మరి.