శ్రీలంక ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఆ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని శ్రీలంకలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొత్త ప్రధాని దిస్సనాయకే ఎలాంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అమెరికాలో నమోదైన కేసును చూపించి ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. అయితే అక్కడ అదానీ పవర్ నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టు విషయంపై మాత్రం ఓ కమిటీ వేస్తామని తెలిపింది.
అదానీ పవర్ తో చేసుకున్న ఒప్పందం రేట్లు చేలా ఎక్కువని.. శ్రీలంకలోని లోకల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీలు అంత కంటే తక్కువ రేటుకే విద్యుత్ ఇస్తాయని కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రధాని దిస్సనాయకేకూడా అదానీతో ఒప్పందాల విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అదానీ ప్రాజెక్టుల్ని ముందుకు కదలనీయలేదు.ఇప్పుడు సమయం చూసుకుని రద్దు చేస్తున్నారు.
అదానీకి ఏదీ కలసి రావడం లేదు. ఇతర దేశాల్లో అదానీ గ్రూప్ ఇమేజ్ దారుణంగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.గతంలో ఆస్ట్రేలియాలోనూ ఆయన సంస్థపై ఆందోళనలు జరిగాయి. ఆఫ్రికాలో చేపట్టిన కొన్నిప్రాజెక్టుల్ని అక్కడి ప్రభుత్వాలు రద్దు చేసుకున్నాయి. కేవలం ఇండియాలో ప్రభుత్వాలు మాత్రం ఆధారాల్లేవని వెనకేసుకు వస్తున్నాయి. రేపు అమెరికా కోర్టులో లంచాలు ఇచ్చినట్లుగా..తీసుకున్నట్లుగా ఎఫ్బీఐ ఆధారాలు బయట పెడితే అదానీ ఇంకా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.