కాలం మారుతున్న కొద్దీ అభిరుచులు మారిపోతున్నాయి. మాకు కొంచెం స్పేస్ కావాలని అనుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ఎవరి బెడ్ రూంలో ఎవరి పర్సనల్ రూములు వారికి ఉండాలని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వారి ప్రైవసీ వారికి ఉండాలని అనుకుంటున్నారు. అందుకే ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణ సమయంలో విశాలమైన వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లకే డిమాండ్ పెరుగుతోంది.
ఐదారేళ్ల కిందటి వరకూ అపార్టుమెంట్లు అంటే సింగిల్ బెడ్ రూం, డబుల్ బెడ్ రూం ఇళ్లకే ప్రాదాన్యత ఇచ్చేవారు. డిమాండ్ తక్కువ ఉంటుందని బిల్డర్లు త్రిబుల్ బెడ్ రూం నిర్మాణ ఫ్లాట్లను పెద్దగా చేపట్టేవారు కాదు. కానీ ఇప్పుడు వాటి కోసమే ఎంక్వయిరీలు వస్తూండటంతో ప్రధానంగా త్రిబు్ల బెడ్ రూం ఇళ్లనే కడుతున్నారు. బడ్జెట్ ఎక్కువగా ఉన్నా సరే ఇలాంటి వాటినే ఎక్కువగా అడుగుతూండటంతో ట్రెండ్ మారిందని బిల్డర్లకూ అర్థమయింది.
ఇప్పుడు చిన్న చిన్న బిల్డర్లు కట్టే అపార్టుమెంట్స్ లోనూ సింగిల్ బెడ్ రూం ను ఎవరూ ప్రిఫర్ చేయడం లేదు. కనీసం డబుల్ బెడ్ రూం అడుగుతున్నారు. ఇప్పుడు అతి త్రిబుల్ బెడ్ రూంకు చేరుతోంది. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా .. పెరుగుతున్న ఆర్థిక స్థోమత, జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలన్న ఆసక్తి వల్ల ఇళ్ల నిర్మాణ రంగంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయి. ముందు ముందు త్రిబుల్ బెడ్ రూం ఇళ్లే అత్యధికంగా అమ్ముడయ్యే.. నిర్మాణమయ్యే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.