ఫార్మలా ఈ రేసు కేసులో రేసింగ్ సంస్థను ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్ వేస్తున్న ప్రశ్నలకు ఏసీబీ కౌంటర్ ఇచ్చింది. రేసులు నిర్వహించే సంస్థ ఎఫ్ఈవోకు నోటీసులు జారీ చేసింది. డబ్బులు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు.. అసలు హెచ్ఎండీతో చేసుకున్న ఒప్పందం ఏమిటి అన్న వివరాలను రాబట్టనున్నారు. తమకు డబ్బులు అందాయని ఆ సంస్థ ధృవీకరించింది. అయితే ఇక్కడ డబ్బులు అందడం కాదు.. అసలు ఎందుకు అందాయన్నది తేల్చనున్నారు.
ఫార్ములా ఈ రేసు కేసును లొట్ట పీసు కేసులని కేటీఆర్ అంటున్నారు కానీ ఆయనకు సుప్రీంకోర్టు వరకూ ఎక్కడా ఊరట లభించలేదు. అయితే ఏసీబీ పోలీసులు మాత్రం ఆయనను అరెస్టు చేయలేదు. తొందరేం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈడీ కూడా ఆయనను ప్రశ్నించింది. ఇపుడు ఏసీబీ అధికారులు FEO నుంచి కూడా స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. మున్సిపల్ శాఖతో ఒప్పందం ఉంటే హెచ్ఎండీఏ నగదు ఎందుకు బదిలీ చేసింది..ఆ డబ్బుల్ని ఎలా వినియోగించారన్న విషయాలను ఏసీబీ వెలికి తీసే అవకాశాలుఉన్నాయి.
ఫార్ములా వన్ రేసింగ్ సంస్థ కూడా తాము బయటపడటానికి కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తే.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక్కడనమోదైన కేసు తమ సంస్థ ఇమేజ్ పై ప్రభావం చూపడాన్ని ఆ సంస్థ అంగీకరించకపోవచ్చు. అందుకే ఎఫ్ఈవో ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.