రఘురామకృష్ణరాజు ఈ రోజు తులసీబాబును గుర్తు పట్టనున్నారు. నిందితుల పరేడ్ ను పోలీసులు ఏర్పాటు చేశారు. తనపై కూర్చుని తనను చంపేందుకు ప్రయత్నించారని రఘురామ చెబుతున్న తులసీబాబు ప్రస్తుతం జైల్లోఉన్నారు. అయితే రఘురామ మొదట్లో కొంత మంది ముసుగులు వేసుకుని వచ్చారని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనను గుర్తు పట్టి.. అధికారికంగా కోర్టుకు చెప్పేందుకు పరేడ్ ను పోలీసులు ఏర్పాటు చేశారు.
తులసీబాబుతో పాటు తులసీబాబులా శరీరాకృతి ఉండే కొంత మందిని వివిధజైళ్లలో గుర్తించి .. గుంటూరుకు తరలించారు. నిందితుడ్ని గుర్తు పట్టేందుకు రావాలని రఘురామకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రఘురామ గుంటూరు జైలుకు వెళ్లి తులసిబాబులా ఉండే వాళ్లను చూసి.. తులసిబాబును గుర్తు పట్టాల్సి ఉంది. రఘురామ తనపై దాడి చేసిన వారు..సీఐడీ అధికారుల గురించి పక్కా సమాచారంతోనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తులసిబాబును గుర్తు పడతారని అంచనా వేస్తున్నారు.
తనపై దాడి చేసిన తులసిబాబును గుర్తు పట్టడంలో రఘురామ విఫలమైతే.. ఆయన ఈ విషయాన్నికోర్టులో బలంగా వాదించుకుని బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది. రఘురామ గుర్తింపు పక్రియ సజావుగా సాగిపోతే.. కేసు మరింత బలంగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.