సొంత తల్లి, చెల్లి కూడా ఆయనను నమ్మడం లేదు. ఆయనకు ఆస్తిపాస్తులుతెచ్చి పెట్టిన వారు కూడా ఛీ కొట్టిపోతున్నారు. పార్టీ నేతలు అంతా అదే పని చేస్తున్నారు. ఇంత కప్ప అపనమ్మకాన్ని మూటగట్టుకున్న లీడర్ జగన్ రెడ్డి. ఏ నాయకుడికి అయినా మొదట ఉండాల్సింది విశ్వసనీయత. జగన్ రెడ్డికి అది తెలుసో లేదో అదే తన దగ్గర టన్నుల కొద్దీ ఉందని .. అదే తన బలం అనుకుంటారు. ఇప్పటికీ అదే చెబుతారు. పార్టీ నేతలు వస్తే.. రాసిస్తే అదే చెప్పుకుంటారు. నిజానికి బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. ఆయనను నమ్ముతున్న వారు ఎవరూ లేరు.. తల్లి.. చెల్లితో సహా.
రాజకీయ నాయకుడికి స్వార్థం ఉండాలి కానీ… అది తన పక్కన వాళ్లను.. తన తల్లి, చెల్లిని కూడా తన పదవుల్ని..పేరును.. వాడేసుకుంటున్నారని వారికి ఆ ప్రయోజనం కల్పించకూడదన్నంత స్వార్థం ఉండకూడదు. తాను మాత్రమే ఎదగాలి.. తాను మాత్రమే తినాలి.. అందరూ తన కోసమే తన్నులు తినాలి..తిట్లుపడాలి. జైలుకు వెళ్లాలి అనుకునే నాయకుడు జగన్ రెడ్డి. ఆయన మనస్థత్వం ఎలా ఉంటుందో జుట్టుకు రంగేసుకోవడానికి భయపడే వైసీపీనేతలు.. పిల్లిగడ్డాన్ని కూడా కాపాడుకోలేని విజయసాయిరెడ్డి వంటి వారిని చూస్తే అర్థమైపోతుంది.
జగన్ రెడ్డి పైకి చెప్పే మాటల్ని నమ్మి ఓట్లేసిన వారు పదేళ్లు భరించి పాతాళంలోకి పడేశారు. ఇప్పుడు ఆయనను అందరూ వదిలేసి వెళ్లిపోతున్నారు. ఆయన ద్వారా లబ్ది పొంది ఇంకా ఏదో పిండుకుందామనుకుంటున్నవారు మాత్రమే ఆయనతో మిగిలారు. రేపు తాము సంపాదించుకున్నది ఊడిపోతుందనుకుంటే వారు కూడా పోతారు. ఇప్పటికే కుమారుడని ఆజ్ఞాతంలోకి పంపారు.తాను బయటకు రావడం మానేసిన సజ్జల కూడా అదే దారిలో పోయినా ఆశ్చర్యం లేదు. తల్లీ చెల్లినే భరించలేకపోయిన జగన్ రెడ్డికి ఇక ఎవరు భరిస్తారు ?