నగరంలోనే ఉండాలి కాస్త ప్రశాంతంగా ఉండాలి అంటే.. శివారులోని విల్లాలు తీసుకోవడమే ఉత్తమం. ఇప్పుడు చాలా మంది అదే పని చేస్తున్నారు. విల్లాస్‌ను ఎంచుకునేది నగరానికి దూరంగా ప్రశాంతంగా జీవించడానికే. కస్టమర్ల మైండ్‌సెట్‌కు తగ్గట్టే డెవలపర్లు ఆలోచిస్తారు కాబట్టి సిటీకి అవతలే ఉంటుంటాయి ఈ నిర్మాణాలు. అయితే ఇప్పుడు చాలా వరకూ సిటీలో కలిసిపోయి ఉంటున్నాయి. దీనికి కారణం రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే.
కీసరలో విల్లా. ప్రాజెక్టులు ఎక్కడో విసిరేసినట్టు కాకుండా కాస్త చేరువుగానే ఉంటున్నాయి. . ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్-8 దగ్గర్లో పలు విల్లా ప్రాజెక్టులు నిర్మితం అవుతున్నాయి. కీసర పరిధిలోకి వచ్చే ఈ విల్లా ప్రాజెక్టచులకు కనెక్టివిటీ బాగా ఉంటుంది. ఉప్పల్‌కి అరగంటలో.. ఉప్పల్ మెట్రోకి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ షామీర్పేట్ సైడ్ 10 నిమిషాలు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి 40 నిమిషాలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ఫార్టీ మినిట్స్‌లో చేరుకునేంత దూరంలోనే ఉన్నాయి.
నగర్ వాతావరణం అసలు కనిపించకపోవడం ఇక్కడి ప్రత్యేకత. అయితే దగ్గర్లోనే విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఉన్నాయి. . ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, ఏఎస్ రావు నగర్, సైనిక్‌పురి, నేరెడ్మెట్, యాప్రాల్, షామీర్పేట్ లాంటి ప్రాంతాలు పావుగంట జర్నీ దూరంలోనే ఉంటాయి. అందుకే కీసరలో విల్లా ప్రాజెక్టులకు మంచి ఆదరణ కనిపిస్తోంది. కోటి నుంచి ధరలు ప్రారంభమవుతున్నాయి.