గుంటూరు నగరం క్రమంగా విస్తరిస్తోంది. దశాబ్దాలుగా ఎక్కడ వేసిన నగరం అక్కడే అన్నట్లుగా ఉంది. కానీ ఇప్పుడు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుని ముందడుగు వేస్తున్నారు. గుంటూరు నగరానికి ఆనుకుని ఉన్న పలు గ్రామాలు సిటీలో కలసిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపినా కలపకపోయినా… సిటీలో భాగంగానే ఉంటున్నాయి. ఇందులో పెదపలకలూరు గ్రామంకు ప్రత్యేకత ఉంది.
సమీపంలో ఉండటంతో కార్పొరేషన్ లో విలీనం చేశారు కానీ చాలా కాలం పాటు ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టలేదు. 2014 తర్వాత మెల్లగా సిటీ విస్తరించి పెదపలుకలూరు వైపు సాగిపోయింది. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంతో మరింతగా పుంజుకుంది. పలువురు బిల్డర్లు అపార్టుమెంట్లు నిర్మించారు. ఇండిపెండెంట్ హౌసులు నిర్మించి అమ్ముతున్నారు. అయితే నగర్ పాలక సంస్థ వైపు నుంచి జరాగల్సిన అభివృద్ధి జరగడం లేదు. డ్రైనేజీ.. రోడ్లు వంటి సౌకర్యాలను వేగంగా కల్పిస్తే మరింతగా అభివృద్ధి చెందుతుంది.
ప్రస్తుతం పెద పలుకలూరు వైపు అపార్టుమెంట్లకు డిమాండ్ అధికంగా ఉంది. కనీసం యాభై లక్షల రూపాయలతో అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. అలాగే గజం స్థలం విలువ యాభై వేల వరకూ ఉంటోంది. ఆరేడు నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు ధరలు భారీగా పెరిగాయి. వచ్చే ఏడాది, రెండేళ్లలో పలకలూరు గ్రామం పూర్తిగా సిటీలో కలిసిపోతుందని.. మరింత ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని అంచనా వస్తున్నారు.