చంద్రబాబుపై జగన్ హయాంలో నమోదు చేసిన కేసుల్ని ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాటిని సీబీఐకి ఇవ్వాలంటూ బాలయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆయన తరపు లాయర్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికిమాలిన పిటిషన్లు వేసి వాదించడానికి ఎలా వస్తారని ప్రశ్నించడంతో ఆ లాయర్ పరువు పోయినట్లయింది. ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించి ఆ పిటిషన్లను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.
వైసీపీ నాయకులకు న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాజకీయం చేయడంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. ఎవరో ఒకరి పేరుతో కోర్టుల్లో పిటిషన్లు వేసి.. వాదనలు జరిగేసమయంలో తమకు కావాల్సినవి లాయర్ తో అనిపించి.. వాటిని ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఈ పిటిషన్లు కూడా భిన్నంగావేస్తూంటారు. ఓ సారి జర్నలిస్టు అని చెప్పి ఒకరి పేరుతో వేస్తారు. ఒకసారి సామాజిక వేత్త అంటారు.. మరోసారి నిరుపేద అంటారు… ఇలా వేసే పిటిషన్లలో అత్యంత ఖరీదైన లాయర్లను పెట్టుకుంటూ ఉంటారు. ఈ పిటిషన్ లాయర్ బాలయ్య పేరు మీద వేశారు. ఆయన పరువు ఇప్పుడు తోటి లాయర్ల ముందుపోయినట్లయింది.
కేసులు పెట్టిప్పుడు.. తప్పుడు ఆధారాలు సృష్టించినప్పుడు.. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసినప్పుడు సీఐడీ జగన్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆయన మానసిక ఆనందం కోసం .. రాజకీయ లక్ష్యాల కోసం చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి ఇప్పుడు అధికారం మారిన తర్వాత అదే సీఐడీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ…సుప్రీంకోర్టుకు వెళ్లడం.. వైసీపీకే చెందింది. మొత్తంగా న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని చంద్రబాబుపై బురద చల్లాలని వైసీపీ అగ్రనేతలు చేసిన ప్రయత్నంలో ఓ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్..మరో హైకోర్టు లాయర్ పరువు అర్పణం అయిపోయింది.