జగన్ రెడ్డికి ఆత్మీయ మిత్రుడని నందిగం సురేష్ కు ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. ఆయన పెట్టుబడి పెట్టారని చెప్పుకున్న యాత్ర టులో ఆయన పాత్రకు మంచి ఎలివేషన్లు ఇప్పించుకున్నారు. కానీ ఆయన జైలుకెళ్తే జగన్ రెడ్డి పట్టించుకోలేదు. కనీసం మంచి లాయర్లను పెట్టుకోలేదు. చివరికి ఆయన భార్య కిందా మీదా పడి.. ఆ కోర్టు.. ఈ కోర్టు తిరిగి చివరికి బెయిల్ తెప్పించుకుంది. దాదాపుగా ఐదు నెలల తర్వాత నందిగం సురేష్ జైలు నుంచి బయటకు వస్తున్నారు. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల కారణంగా..అధికారం పోవడంతోనే అడ్రస్ లేకుండా పోయారు నందిగం సురేష్. రెండు నెలల ఆజ్ఞాతం తర్వాత పోలీసులు హైదరాబాద్లో పట్టుకున్నారు. ఈ లోపు న్యాయపరమైన ప్రయత్నాలన్నీ చేసి విఫలమయ్యారు. అరెస్టు అయిన తర్వాత ఆయన బయటకు రాలేదు. రెండు వారాల్లో వస్తారని ఆయన భార్యకు వైసీపీ నేతలు భరోసా ఇచ్చారు. కానీ కేసుల మీద కేసులు వేస్తూండటంతో ఎలా బయటకు తీసుకు రావాలో తెలియకు జగన్ కూడా ముఖం చాటేశారు. ఆయన భార్యే లాయర్లను పట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగారు.
చివరికి వైసీపీ లాయర్లు చేసిన నిర్వాకంతో సుప్రీంకోర్టులోనూ ఆయనకు బెయిల్ రాలేదు. నందిగం సురేష్ చాలా మంచోడని పాత కేసులు లేవని సుప్రీంకోర్టులోనే అబద్దం చెప్పి ఆయనకు బెయిల్ రాకుండా చేశారు. మరోసారి దిగువ కోర్టులో ప్రయత్నించి.. ఐదు నెలలుగా జైల్లో మగ్గుతున్నారని చెప్పి .. బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీ నేతల ప్రమేయం లేకుండా బెయిల్ తెచ్చుకున్నారు.