జగన్ మాఫియా పాలన చేశారు. పోలీసు వ్యవస్థతో ఆయన ఇష్టం లేని వారిపై కేసులు పెట్టారు. కొట్టించారు. సెటిల్మెంట్లు చేయించారు. జత్వానీ లాంటి సామాన్యులపై వ్యవస్థను ప్రయోగించారు.ఇలా చెప్పుకుంటూ పోతే బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. బాబోయ్ ఇలా చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన పాలన చేశారు. ఇప్పుడు ఒక్కో విషయం బయటపడుతోంది. ఆయన తన బిగ్ బీ టీం పేరుతో నలుగుర్ని ఇలాంటి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకుని వారితో సమాలోచనలు చేసి అన్నీ చేసేవారు.
బిగ్ బి అనే ఓ టీం ఉండేదని..తాజాగా సీఐడీ అధికారులకు తెలిసింది. అది వాట్సాప్ గ్రూపుగా నడిచిందా.. మరో గ్రూపుగా నడిచిందా అన్నది తెలియదు కానీ.. ఈ నలుగురు బిగ్ బాస్ టీం. అంటే జగన్ టీం. వారు ఎప్పుడు ఎవర్ని అరెస్టు చేయాలి..ఎవర్ని కొట్టించాలి.. ఎక్కడ సెటిల్మెంట్స్ చేయాలి.. ఎక్కడ దోపిడీ చేయాలన్నది డిసైడ్ చేస్తారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ఈ బిగ్ బి టీం గురించి వెలుగులోకి వచ్చింది. తులసిబాబు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
సీఐడీ పోలీసులు ఈ బిగ్ బీ టీంలో ఎవరెవరు ఉన్నారో .. వారేం చేశారో ఆరా తీస్తున్నారు. ఈ టీం వ్యవహారాలపై సమాచారం వెలుగులోకి వస్తే సీఎంవోను ఓ మాఫియా రాజ్యంగా ఎలా మార్చుకున్నారో స్పష్టమవుతుంది. ఈ అంశంపై సీఐడీ పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది. జగన్ రెడ్డి పై కూడా రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు నమోదు అయింది. ఈ దర్యాప్తులో తీగ లాగితే అసలు మాఫియా పాలన దందాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.