ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ఎంపీలు ప్రజల కోసం మీడియా ముందు అదని.. ఇదని మాట్లాడుతూంటారు. కానీ అంతర్గతంగా వ్యక్తిగత పనులు చేసుకోవడానికి పదవుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు అంతే. ఇప్పుడు కూడా అంతే. వరుసగా నిర్వీర్యం అయిపోతున్నా.. తమ పద్దతి మార్చుకోవడం లేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీలు ఉన్న అన్ని పార్టీలు పార్లమెంట్ లో ఎలా వ్యవహరించాలో వ్యూహాన్ని ఖారారు చేసుకున్నాయి. ఆయా పార్టీల అధినేతలు సమావేశమై ఎంపీలకు ఏం చేయాలో చెప్పి పంపించారు.
కానీ వైసీపీ ఎంపీలకు మాత్రం అలాంటివేమీ ఉండవు. కనీసం స్కూల్ కు వెళ్లే ముందు విద్యార్థులు హోంవర్క్ చేస్తారు. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం.. అదేమీ ఉండదు. ఊరకనే అలా వెళ్తారు. కూర్చుకుంటారు. వస్తారు. ఇక్కడ వైసీపీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ వస్తే మీడియాతో మాట్లాడతారు. వారికి టీడీపీ, జనసేనలు భాగంగా ఉన్న ఎన్డీఏ కూటమిపై పోరాడటం రాదు. కానీ మద్దతుగా ఓటింగ్ చేయాడానికి మాత్రం రెడీగా ఉంటారు. పార్లమెంట్ లో జరిగే ప్రతి ఓటింగ్ విషయంలో ఎన్డీఏకు వైసీపీ మద్దతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
జగన్ రెడ్డిపై కేసులు, వివేకానందరెడ్డి హత్య సహా ఐదేళ్ల పాలనలో చేసిన ఘోరాలపై చర్యలు తీసుకోకుండా.. తమ పై బీజేపీ గుడ్ లుక్స్ ఉండాలంటే.. తమను తాము ఎప్పటికప్పుడు సమర్పించుకుంటూంటే తప్ప వైసీపీకి మనుగడ ఉండదు. తెగించి పోరాడే ధైర్యం లేదు. అందుకే వైసీపీకి పార్లమెంట్ లో ఒకే ఒక్క వ్యూహం.. ఎన్డీేకు మద్దతుగా ఓటేసి.. రావడం. అంత కంటే వారికి వ్యక్తిత్వ హననం ఏముంటుంది?