గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల పదవి కాలం ముగిసిపోయింది. స్పెషలాఫీసర్ల పాలన వచ్చింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ పదవి కాలం మాత్రం ఇంకా ఏడాదికిపైగానే ఉంది. పదవి కాలం ముగిపోయిన మున్సిపాలిటీలకు .. స్థానిక సంస్థలతో పాటు ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే.. గ్రేటర్ లో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారా అన్నదానిపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడుగ్రేటర్ పరిధిని దాటిపోయింది. దాని చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఎక్కువగా జరుగుతోంది. ఈ కారణంగా వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. పర్మిషన్లు, ఇతర విషయాల్లో స్థానిక సంస్థలు కీలకంగా ఉంటాయి. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల స్పెషలాఫీసర్ల పాలన నడుస్తుంది. రియల్ ఎస్టేట్ సహజంగానే ఈ కారణంగా ఎఫెక్ట్ అవుతుంది.
గ్రేటర్ పరిధి మొత్తాన్ని .. గ్రేటర్ కౌన్సిల్ గా మార్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది కష్టం అయితే.. మొత్తం కలిపేసి నాలుగు కార్పొరేషన్లుగా చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది. కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థలు ఉనికిలో ఉంటే… జరిగే వ్యవహారాలు వేరు.. ఉనికిలో లేకపోతే ఉండే స్తబ్దతో వేరు. ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే.. మంచిదన్న వాదన రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది.