ఓ దశలో శ్రీలీల స్పీడ్ చూసి అంతా నివ్వెర పోయారు. నాలుగు సినిమాలు సెట్స్‌పై తయారవుతోంటే, అందులో రెండు సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్. మరో శ్రీదేవి అవుతుందని ఊహించారు. కానీ శ్రీలీలకు దిష్టి తగిలింది. వరుసగా ఫ్లాపులు వచ్చాయి. అవకాశాలు తగ్గాయి. అయితే ‘పుష్ప 2’లో ఐటెమ్ గీతం తరవాత అనూహ్యంగా పుంచుకొంది. ఇప్పుడు మళ్లీ ఇదివరకటి స్పీడులోనే సినిమాలు ఒప్పుకొంటోంది. పారితోషికం కూడా పెంచుకొంటూ వెళ్తోంది. కానీ శ్రీలీల చేస్తున్న తప్పేంటంటే… కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయో, లేదో చూడకుండా అడ్వాన్సులు అందేసుకొంటోంది. దాంతో డేట్ల విషయంలో క్లాష్ వస్తోంది. శ్రీలీల కోసం సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు ఒకొక్కటిగా జారిపోయే ప్రమాదం ఉంది.
రవితేజ ‘మాస్ జాతర’లో శ్రీలీల కథానాయిక. అయితే ఇప్పుడు శ్రీలీల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకూ 12 రోజుల పాటు కాల్షీట్లు ఇచ్చింది. మరో 20 రోజులైనా తన డేట్లు కావాలి. కానీ… శ్రీలీల ఓ తమిళ సినిమాకు బల్క్‌గా డేట్లు ఇచ్చేసింది. రవితేజ సినిమాకు ఏప్రిల్ లో ఇస్తానని అంటోందట. దాంతో శ్రీలీలని పక్కన పెట్టి మరో కథానాయికని తీసుకొందామనా అనే ఆలోచన చేస్తోంది చిత్రబృందం. అయితే ఇప్పటికే కొంత షూట్ జరిగింది. కథానాయికని పక్కన పెడితే, అవన్నీ మళ్లీ రీషూట్లు చేయాలి. అఖిల్ సినిమాలోనూ కథానాయికగా శ్రీలీలని ఎంచుకొన్నారు. కానీ అక్కడా కాల్షీట్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో వాళ్లు కూడా మరో ఆప్షన్ వెదుకుతున్నట్టు తెలుస్తోంది.
వచ్చిన ప్రతీ అవకాశాన్నీ కావాలనుకోవడం, పారితోషికం కోసం సినిమాలు ఒప్పేసుకోవడం వల్లే ఈసమస్య. ఇలాగైతే నిర్మాతలు ఇబ్బందుల్లో పడతారు. ఈ విషయాన్ని శ్రీలీల గమనిస్తే మంచిది.