పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత మూడు దశాబ్దాలుగా అడవిలో గెస్ట్ హౌస్ కట్టుకుని ఏం చేస్తున్నారన్నదానిపై భిన్నమైన ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అడవిలో గెస్ట్ హౌస్ ఎర్రచందనం కూలీల కోసం కట్టించారా అని ప్రశ్నించడంతో ఈ విషయం మరోసారి హైలెట్ అవుతోంది.
అడవిలో ఉన్నది విలాసవంతమైన గెస్ట్ హౌస్ అని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కూలీల కోసం కట్టించామని చెప్పారు. పెద్దిరెడ్డి కాంట్రాక్టర్ కూడా. ఆయన సైట్ల వద్ద కూలీల కోసం షెడ్డులు వేస్తారు కానీ.. ఇళ్లు కట్టించరు. అడవిలో పని చేసే వారిలో కోసం అలాంటి విలాసవంతమై ఇళ్లు కట్టిస్తారని ఎవరూ అనుకోరు. అసలు అడవి మధ్యలో ఉన్న స్థలాలను ఎలా కొనాలని అనిపించింది.. అక్కడ ఏం చేసేవారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారుతోంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా కు సంబంధించి అడవిలో కార్యకలాపాలపై ఆరా తీస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల కారణంగా ఈ పాటికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చి వేయడమే కాదు.. వారిని జైళ్లకు పంపాల్సి ఉంటుంది. కానీ ఎందుకో ఇంకా ఆ విషయంలో అడుగులు ముందుకు పడటం లేదు. పైగా పెద్దిరెడ్డి సవాళ్లు కూడా చేస్తున్నారు. ఆయనను ఓ బలమైన శక్తి కాపాడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వచ్చే రెండు వారాల్లో ఆయన బాగోతం అంతా బయట పెడతామని అంటున్నారు. కానీ.. చాలా మంది టీడీపీ కార్యకర్తలకూ డౌట్ గానే ఉంది.