వైసీపీకి మరికొంతమందిలో నేతలు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఫీజు పోరు పోరుతో జగన్ రెడ్డి పెట్టి పోయిన బకాయిలు ఇవ్వాలంటూ జగన్ రెడ్డినే ఆందోళనకు పిలుపునిచ్చారు. గతంలో రెండు సార్లు వాయిదా పడిన ఈ ఆందోళనలు ఐదో తేదీన నిర్వహించాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చేస్తే ఈసీ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ విషయం పక్కన పెడితే.. అవన్నీ జగన్ రెడ్డి పెట్టిపోయిన బకాయిలేనని .. ఆ బాధలు పడుతున్న విద్యార్థులకు తెలుసు.
గత ఏడు నెలల కాలంలో ప్రభుత్వం నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తామని చెప్పడంతో కొత్తగా కాలేజీల్లో చేరిన వారికి ఎలాంటి సమస్యలూ లేవు. పాత బకాయిలు మాత్రం గుదిబండల్లా మారాయి. జగన్ రెడ్డి ప్రతి మూడు నెలలకోసారి బటన్ నొక్కానని చెబుతున్నారు కానీ ఆ బటన్లు ఎక్కడా పని చేయలేదు. సాక్షి పత్రికకు ప్రకటనలు ఇచ్చుకున్నారు కానీ.. తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. ఇప్పుడు వాటిని చెల్లించాల్సిన భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడింది.
సంక్రాంతికి ముందు ఆరు వందల కోట్ల రూపాయలు కాలేజీలకు కట్టారు. ఇంకా మూడు వేల కోట్ల వరకూ పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తాము చేసిన తప్పుపై .. తామే ఆందోళనలు చేయడం ఏమిటన్న వేదన వైసీపీ నేతల్ని పట్టి పీడిస్తోంది. ఇదే కారణం చెప్పి కొంత మంది పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నలుగురు, ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. వీరంతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.