కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు సోమ,మంగళవారాల్లో జరగనున్నాయి. వైసీపీ ఈ ఎన్నికల విషయంలో కంగారు పడిపోతోంది. గతంలోస్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకున్న వైసీపీకి అన్ని చోట్లా పూర్తి బలం ఉంది. అందుకే అన్నీ తమ ఖాతాలో పడిపోతాయని అనుకుంది.కానీ పరిస్థితి అలా లేదు. అందరూ కౌన్సిలర్లు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. దీంతో పరువుపోతుందని కంగారు పడుతోంది.
తాము కౌన్సిల్ సమావేశాలకు విప్ జారీ చేశామని ఎవరైనా పార్టీని ధిక్కరిస్తే ఎన్నికల సంఘంతో వేటు వేయిస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ కమిషన్ కు చైర్మన్ గా జగన్ నియమించిన నీలం సాహ్ని ఉన్నారు. ఆమె గతంలో చీఫ్ సెక్రటరీగా పని చేసినప్పుడు జగన్ చెప్పినట్లుగా చేశారు. కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదు. పలుమార్లు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొన్నారు. రిటైరవ్వగానే ఆమెకు ఎస్ఈసీ పోస్టును జగన్ ఇచ్చారు. తాము నియమించిన ఎస్ఈసీ కాబట్టి మీపై వేటు వేయిస్తామని వైసీపీ నేతలు తమ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను బెదిరిస్తోంది.
అయితే స్థానిక సంస్థల్లో అనర్హతా వేటు ఎవరు వేయాలన్నదానిపై స్పష్టత లేదు. నేరుగా ఎస్ఈసీకి అనర్హతా వేటు వేసే అవకాశం ఉందో లేదో స్పష్టత రావాల్సి ఉంది. అయినా ఏ మున్సిపాల్టీలో అయినా డిప్యూటీ చైర్మన్ పదవిని గెల్చుకోలేకపోతే .. ఆ కౌన్సిల్ లో బలం కోల్పయినట్లు. ఇక ఫిరాయింపులకు..వేటు వేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుందన్న ప్రశ్న వస్తోంది.,