జగన్ రెడ్డి మారాలని ఆయన కోసం అడ్డమైన ప్రచారాలన్నీ కూటమిపై చేసిన టీవీ9 లాంటి మీడియా కూడా అదే పని గా కథనాలు రాస్తున్నారు. అయితే జగన్ రెడ్డి మారడం అనేది అసాధ్యం అని ఆయన.. ఆయనలాగే ఉంటారని కొంత మంది అంటున్నారు లండన్ నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్న ఆయన..నాలుగో తేదీన ఏపీలో పార్టీలో నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అంశంపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
చంద్రబాబునాయుడు ఈ నెలలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టాలనుకుంటున్నారు. ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో పది మంది ఎమ్మెల్యేలతో కలిసి బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆయన అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడం లేదని.. ఆయన ఇప్పటికే లేఖలు రాస్తున్నారు. పథకాలు అమలు చేయడం లేదని.. తాము ఉంటే.. ప్రజల ఖాతాల్లో డబ్బులు పడేవని ఆయన చెబుత్నారు. ఈ అంశాలపై అసెంబ్లీలో నిలదీయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
వరుసగా మూడు సెషన్లకు హాజరు కాకపోతే స్పీకర్ కు అనర్హతా వేటు వేసే అధికారం ఉంది. అలా వేటు వేస్తే పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయి. అది ఆత్మహత్యాసదృశ్యమైన నిర్ణయం అవుతుందని జగన్ రెడ్డికి తెలుసు. దీన్నుంచి తప్పించుకోవడానికి అయినా ఆయన అసెంబ్లీకి హాజరవ్వాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ అసెంబ్లీకి వెళ్తే.. ఎదురుగా ఉండేది అయితే అయ్యన్న లేకపోతే.. రఘురామకృష్ణరాజు., ఇక మాట్లాడాల్సి వస్తే అచ్చెన్నాయుడు దగ్గర నుంచి పవన్‌కల్యాణ్ వరకూ చాలా మంది ఉంటారు. జగన్ ఉన్న పదకొండు ఎమ్మెల్యేలతో గలాటా చేయడానికి ఉండదు.
అయితే ఏం జరిగినా సరే.. అసెంబ్లీకి వెళ్లాలని జగన్ అనుకుంటేమాత్రం ఆయన మారినట్లేనని వైసీపీ వర్గాలనుకుంటున్నాయి.