తెలంగాణలో కొత్త కుల రాజకీయం ప్రారంభం అయింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నిర్మించారో అలాగే తాను కూడా బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుకుంటున్నారు.. ఇటీవలి కాలంలో ఆయన రెడ్లను టార్గెట్ చేసుకుటూ వేస్తున్నారు. తాజాగా నిర్వహించిన బీసీ సభలోనూ ఆయన మరింత రెచ్చిపోయారు. రెడ్డి సామాజికవర్గంపై అనుచితమైన భావను వాడారు.
బీసీలంతా రెడ్డి సామాజికవర్గానికి వ్యతిరేకం కావాలని.. వారికి వ్యతిరేకంగా ఏకం కావాలని…తన నాయకత్వంలో పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్న కోరుకుటున్నారు. అందులో భాగంగా ఆయన చాలా దూకుడుగా రెడ్డి వర్గంపై విరుచుకుపడుతున్నారు. ఇలా చేయడం వల్ల బీసీ వర్గాలన్నీ రెడ్డి వర్గంపై వ్యతిరేకత పెంచుకుంటాయో లేదో కానీ.. తెలంగాణ సమాజంలో కులద్వేషం నింపడానికి మాత్రం తీన్మార్ మల్లన్న కారణమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ తెలంగాణ ఉద్యమం చేపట్టిన తర్వాత ఓ కులంపై ఎప్పుడూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు కానీ.. చంద్రబాబు సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ కింది స్థాయిలో ప్రచారం చేశారు. అంతటా అదే వ్యతిరేకత విస్తరించేలా చేశారు. కానీ ఎప్పుడూ బహిరంగపర్చలేదు. అయితే తీన్మార్ మల్లన్న మాత్రం.. రెడ్లపై ఏకపక్షంగా బీసీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన తీరు తెలంగాణ సమాజంలో అశాంతి రేపడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. అయితే ఎంత మంది ఆయనను సీరియస్ గా తీసుకుంటారన్న దాన్నిబట్టి ఆ అంశం ఆధారపడి ఉంటుంది.