తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ రెండు ఆషామాషీ వ్యవహారాలు కాదు. అత్యంత క్లిష్టమైనవి. ఏం చేసినా తప్పు పట్టేందుకు విపక్షాలు రెడీగా ఉంటాయి. ఇతర వర్గాల్ని రెచ్చగొట్టేందుకు తమ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో చేస్తాయి.
బీసీ కులగణన విషయంలో ఇప్పటికే రాజకీయం పీక్స్‌లో ఉంది. అసలు సర్వే రిపోర్టును తప్పు పడుతున్నారు. బీసీల జనాభాను తక్కువ చూపిస్తున్నారని గతంలో చేసిన సకల జనుల సర్వే రిపోర్టును సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఆ సర్వే రిపోర్టు అధికారికంగా ఎక్కడా లేదు. అయినా దాన్ని ప్రశ్నించే వర్గాలకు అందుబాటులోకి తెచ్చి.. దాన్ని చూపించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. నలభై రెండుశాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తే.. తర్వాత మరో రకంగా రాజకీయం చేస్తారు. ఇతర వర్గాలకు అన్యాయం జరిగిదని వారిని రెచ్చగొట్టకుండా ఉండరు.
ఇక ఎస్సీ వర్గీకరణ అనేది ఓపెద్ద టాస్క్ . ఇప్పటికే రెండు వర్గాలు పొట్లాడుకుంటున్నాయి. కాంగ్రెస్ లోని మాల్ వర్గానికి తానే ప్రతినిధినని వివేక్ వెంకటస్వామి రంగంలోకి దిగి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాదిగ వర్గం తరపున సంపత్ మాట్లాడుతున్నారు. వివేక్ పై చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసినా మాదిగ నేత మందకృష్ణ.. కాంగ్రెస్ కు..రేవంత్ కు సపోర్టు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన బీజేపీ వైపు ఉన్నారు. సహజంగా ఎస్సీలు కాంగ్రెస్ ఓటు బ్యాంక్. ఇప్పుడు ఆ బ్యాంకులో విభజన తెచ్చే అవకాశాన్ని ఎస్సీ వర్గీకరణ ఇస్తుంది. దీన్ని రాజకీయ పార్టీలు వదులుకుంటాయా ?
రేవంత్ రెడ్డి ఇప్పుడు సోషల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. ఇది ఎలాంటి ఫలితాలనైనా ఇవ్వవొచ్చు. తేడా వస్తే.. ఆయనకే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. దిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది.