ఓ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల్ని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు?. ఖచ్చితంగా ప్రజాప్రయోజనాలు, రాష్ట్రం కోసం పనిచేయాలిని చెప్పి ఎన్నుకుంటారు. అంతే కానీ మీ వ్యక్తిగత పనులు చేసుకోండి.. మీ నాయకుడి కేసుల్ని , ఆ అక్రమాస్తుల కేసుల్లో నిందితుల్ని కాపాడుకోండి అని మాత్రం ఓట్లు వేయరు. కానీ వైసీపీ నేతలు .. తమకు పవర్ ఉన్న కాలంలో పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రజాబలాన్ని వినియోగించుకున్నారు. ఎంపీలంతా జగన్ కు అవసరం అయితే ప్రత్యేక విమానాల్లో వెళ్లి అధికారుల్ని కలుస్తారు.కానీ రాష్ట్రం కోసం ఏ ఒక్క మాట అడగరు.
నిమ్మగడ్డ ప్రసాద్ ఓ సారి సెర్బియాలో ఇంటర్ పోల్ అధికారులకు దొరికితే ఆయనను విడిపించడానికి దేశ విదేశాంగ మంత్రి వద్దకు వైసీపీ ఎంపీలంతా ప్రత్యేక విమానం వేసుకుని మరీ వెళ్లారు. ఎలాగోలా ఆయనను విడిపించుకుని వచ్చి తమ నేత జగన్ కు చిక్కులు రాకుండా చేసుకున్నారు. కానీ అదే ఎంపీలు.. పోలవరం ప్రాజెక్టు కోసం లేదా రాజధాని కోసం లేదా..విభజనహామీల కోసం ఎప్పుడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. బడ్జెట్ లో నిధులు కేటాయింపులు లేకపోయినా నోరెత్తలేదు. అదే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని సీబీఐ ప్రయత్నించినప్పుడు మాత్రం..తమ పవర్ అంతా ఉపయోగించి లాబీయింగ్ చేసుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కానీ రాష్ట్రం కోసం అలాంటి ప్రయత్నాల్లో సగం కూడా చేయలేదు.
ఇప్పుడు కూటమి ఎంపీలు పూర్తి స్థాయిలో రాష్ట్రం కోసం పని చేస్తున్నారు. వారి పై కేసులు లేవు. వారి అధినేతపై కేసులు లేవు. వ్యక్తిగత లాభం కోసం తమ పదవుల్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు. అందుకే బడ్జెట్లో రాష్ట్రానికి దండిగా నిధుల కేటాయింపులు కనిపిస్తున్నాయి. బడ్జెటేతర సాయం.. పెట్టుబడుల గురించి చెప్పాల్సిన పని లేదు. రైల్వే బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రానికి కూడా రానన్ని భారీ కేటాయింపులు వచ్చాయి.దాదాపుగా పది వేల కోట్లు రైల్వే ఇన్ ఫ్రా కోసం రాష్ట్రంలో ఖర్చు పెట్టబోతున్నారు.
ప్రజలు ఇచ్చిన బలాన్ని రాష్ట్రం కోసం… ప్రజల కోసం వినియోగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో.. కూటమి సభ్యులు చూపిస్తున్నారు. వ్యక్తిగతంగా వాడుకుంటే ఎంత నష్టమో వైసీపీ సభ్యులు చూపించారు. ఆ తేడాను ప్రజలు కూడా గుర్తిస్తున్నారు.