అసెంబ్లీ పని దినాల్లో అరవై రోజుల పాటు అసెంబ్లీకి వరుసగా హాజరు కాకపోతే ఆటోమేటిక్ గా అనర్హతా వేటు పడుతుందని డిప్యుటీ స్పీకర్ రఘురామ ప్రకటించారు. స్పీకర్ కు సమాచారం ఇస్తే .. చిన్న పిల్లలు దొంగ లీవ్ లెటర్లను పెట్టినట్లుగా జగన్ తో పాటు ఎమ్మెల్యేలు కూడా దొంగ లీవ్ లెటర్లను పెడితే తప్ప..అనర్హతా వేటు తప్పించుకోవడం ఖాయం. అయితే తాము ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదో బయటకు ఒకటిచెప్పి.. స్పీకర్ కు మరో కారణంతో గైర్హాజరుకు కారణం చెబితే మాత్రం పరువు పోతుంది. అందుకే వారు అలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చు.
ఇప్పుడు వైసీపీ సభ్యుల ముందు ఉన్న ఆప్షన్ అనర్హతా వేటుకు గురి కావడమే. ఈ రిస్క్ ఎందుకులే అనుకుంటే…అందరూ అసెంబ్లీలోనే తేల్చుకుంటామని ముందుకు రావడం. అలా వచ్చేందుకు జగన్ రెడ్డి సిద్ధంగా ఉంటారా అన్నది అసలు సస్పెన్స్. జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారని వైసీసీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.అదే జరిగితే ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే ఆయన వస్తే మాత్రం… ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకూ రానని చేసిన చాలెంజ్ ను పక్కన పెట్టినట్లు అవుతుంది. కానీ జగన్ మనస్థత్వం దానికి విరుద్దమని చెబుతున్నారు. అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే టైప్ జగన్ ..ఏమైనా చేయవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
అసెంబ్లీకి వెళ్లకపోతే అందరిపైనా అనర్హతా వేటు ఆటోమేటిక్ గా పడుతుంది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా కొట్టివేయవు. అప్పుడు ఉపఎన్నికలు వస్తాయి. ఆ పదకొండు సీట్లలో ఎన్ని గెల్చుకుంటారో చెప్పడం కష్టం. జీరోకి పడిపోతే పార్టీ మూతపడుతుంది. అయితే జగన్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రజల వద్దకు సానుభూతి కోసం పోయే అవకాశం ఉంది. ప్రతిపక్షం లేకుండా చేశారని నిందించి.. ఏడుపులు, పెడబొబ్బలు పెట్టి ప్రజల ను తన వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. మరి అలాంటి చాన్స్ తీసుకుంటారా.. రిస్క్ ఎందుకులే అని.. సైలెంట్ గా అసెంబ్లీకి వెళ్లి వస్తారా ?