అల్లు అర్జున్ కెరీర్ ని మలుపుతిప్పిన సినిమా ఆర్య. ఆ సినిమా చాలా విషయాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలించింది. సుకుమార్ లాంటి కల్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే చార్ట్ బస్టర్. అప్పటి నుంచి దేవితో బన్నీ జర్నీ కొనసాగుతోంది. మొన్న వచ్చిన పుష్ప 2 తో బన్నీ దేవి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యింది.
అయితే దేవి మ్యూజిక్ తో అల్లు అర్జున్ కి ఓ స్వచ్చమైన ప్రేమకథ చేయాలని ఉందట. అది మామూలు ప్రేమ కథ కాదు. ఆరు పాటలు వుండాలి. ఆ ఆరు పాటలు కూడా లవ్ సాంగ్స్ అయివుండాలి. పుష్ప 2 సమయంలో ఈ టాపిక్ వచ్చిందట. ఓ కాగితంపై ”ఆరు లవ్ సాంగ్స్ వున్న సినిమా చేద్దాం’ అంటూ బన్నీ స్వయంగా దేవిశ్రీకి రాసిచ్చారట. ఆ నోట్ తీసుకున్న దేవి.. ఆ నోట్ పై బన్నీ సంతకం కూడా పెట్టించారట. ఈ విషయాన్ని స్వయంగా దేవిశ్రీ చెప్పారు. ప్రేమ గీతాలు అందించడంలో దేవిశ్రీ దిట్ట. ఆయన మ్యూజిక్ ఇచ్చిన తండేల్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.