కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ముకుందా బాక్సాఫీసు దగ్గర సరిగా ఆడలేదు కానీ, ఆ సినిమాలోనూ మంచి ఫీల్ ఉంటుంది. ‘బ్రహ్మోత్సవం’తో డౌన్ ఫాల్ మొదలైంది. `పెదకాపు` ఆయన్ని బాగా నిరాశ పరిచింది. తన పంధా మార్చి తీసిన సినిమా అది. కానీ వర్కవుట్ కాలేదు. ‘పెదకాపు’ హిట్టయితే ‘పెదకాపు 2’ తీసేవాళ్లు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆ తరవాత ఓ కన్నడ హీరో కోసం ఓ కథ రాశారు. అది సెట్స్‌పైకి వెళ్లే లోపే.. ఆ హీరో మర్డర్ కేసులో జైలుకెళ్లాడు. దాంతో ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు తనదైన స్టైల్ లో ఓ చిన్న సినిమా తీయాలని భావిస్తున్నాడు. ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్ పెట్టాడు. ఇద్దరు చెల్లెళ్ల కథ ఇది. సీతమ్మ వాకిట్లో సినిమాలో ఇద్దరు అన్నదమ్ముల కథ చూపించాడు. ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇద్దరు మంచి హీరోయిన్లు కావాలి. అందుకోసం వేట జరుగుతోంది. హీరోయిన్లు ఫిక్సయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. దీంతోపాటు మరో కథ కూడా రెడీ చేస్తున్నాడు శ్రీకాంత్. నిర్మాతలతైతే ఇప్పటికీ శ్రీకాంత్ తో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నారు. తగిన స్టార్ కాస్ట్ కావాలంతే.