పార్టీలో కార్యకర్తలు కనిపించకపోవడంతో వారంద్నీ యాక్టివ్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారు. కార్యకర్తల విషయంలో తప్పు చేశానని అంగీకరిస్తున్నారు. ఈ సారి అధికారం వస్తే జగన్ 2.0ని చూస్తారని హామీ ఇస్తున్నారు. విజయవాడ కార్పొరేటర్లతో సమావేశమైన వీడియోను సమావేశం తర్వాత విడుదల చేశారు. ఇందులో ఆయన పాత ప్రసంగాన్ని కొత్తగా చదివారు. ఎప్పట్లో పులి నోట్ల తల, బిర్యానీలు, పథకాలు ఇలా అన్నీ చెప్పుకొచ్చారు. అయితే కార్యకర్తలకు మాత్రం మరోసారి తనను నమ్మాలని విజ్ఞప్తి చేసుకునేందుకు కొత్త పద్దతుల్లో ప్రయత్నించారు.
ఈ సారి గెలిస్తే కార్యక్రతల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని చెప్పుకొచ్చారు. మరి పదేళ్లు పని చేసిన వారి కోసం.. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎందుకు పని చేయలేదు అనే డౌట్ వస్తుంది కాబట్టి తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాననని కవర్ చేసుకున్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాననని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశానని.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని రాసుకొచ్చినవి చదివి వినిపించారు.
జగన్ పై కార్యకర్తలు నమ్మకం కోల్పోయారు. సొంత పార్టీ నేతలు కూడా ఆయనను నమ్మలేక పారిపోతున్నారు. ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు తనను నమ్మాలని జగన్ వేడుకుంటున్నారు. వాలంటీర్లను..సచివాలయ ఉద్యోగ వ్యవస్థలను తెచ్చి కార్యక్రతలను రోడ్డున పడేసిన జగన్ ఇప్పుడు ప్రజల కోసమే వారిని పక్కన పెట్టానని..వారి జీవితాలతో ఆడుకున్నానని అంటున్నారు ఈ సమావేశంలో తన జిల్లాల పర్యటన నుంచి జగన్ పెద్దగా మాట్లాడలేదు.